నిరంతరం జ్వరం వస్తుందా? అయితే ఇది ఆ లక్షణమే?

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొద్దిగా జలుబు చేసినా, లేదా కొద్ది రోజుల నుంచి జ్వరం వస్తున్న ప్రతి ఒక్కరూ కరోనా అని భయపడుతూ ఉంటారు.

కరోనా సోకిన వారిలో జ్వరం రావడం కూడా ఒక లక్షణమే అయినప్పటి, కొన్నిసార్లు అది కరోనా కాకపోవచ్చు.

ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్నప్పుడు వెంటనే వైద్య పరీక్షలు చేయించుకొని ఎటువంటి వ్యాధి తో బాధపడుతున్నావమో నిర్ధారించుకోవడం వల్ల తగిన చికిత్స చేయించుకోవచ్చు.కొద్ది రోజుల నుంచి జ్వరంతో బాధపడుతూ, కీళ్ల నొప్పులు, తలనొప్పి, చర్మంపై దద్దుర్లు ఏర్పడడం వంటి లక్షణాలు కనుక ఉంటే మీరు డెంగ్యూ జ్వరంతో బాధ పడుతున్నారని అర్థం.

Constant Fever, Symptom, Corona Virus,Dengue Fever, Smell And Taste, Edes Egyp

కరోనా సోకినప్పుడు జ్వరంతో పాటు, రుచి, వాసన ను కోల్పోతాము.కానీ డెంగ్యూ జ్వరం వల్ల రుచి, వాసన తెలుస్తుంది.

డెంగ్యూ జ్వరంతో బాధపడేవారికి చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి.ఈ డెంగ్యూ జ్వరం ఈడేస్ ఈజిప్ట్ అనే జాతికి చెందిన ఆడ దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది.

Advertisement

మనదేశంలో 1780వ సంవత్సరంలో మొట్టమొదటి డెంగ్యూ కేసు నమోదయింది.దీని తర్వాత వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ,సరైన చికిత్స ద్వారా మరణాల రేటు తక్కువగా ఉంది.

డెంగ్యూ జ్వరంతో బాధపడేవారు వారి శరీర ఉష్ణోగ్రతలను తరచూ పర్యవేక్షిస్తూ ఉండాలి.వైద్యుడిని ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ సరైన చికిత్స తీసుకోవడం వల్ల ప్రమాదం నుంచి బయట పడవచ్చు.

దీనిని నిర్లక్ష్యం చేస్తే అధిక జ్వరం వల్ల కొన్నిసార్లు మరణం కూడా సంభవిస్తుంది.తరచూ జ్వరం రావటం వల్ల మన శరీరం డీహైడ్రేషన్ కు లోనవుతుంది.

తద్వారా ఎక్కువ మొత్తంలో ద్రావణాలు తీసుకోవటం మంచిది.వర్షాకాలం మొదలవడంతో దోమల బెడద అధికంగా ఉండటం వల్ల ఎక్కువ మద్ది డెంగ్యూ బారిన పడే అవకాశం ఉంటుంది.

ఆ ఆలయంలో రాహువుకు పాలు పోస్తే.. నీలంగా మారతాయ్

కావున దోమల మన ఇంట్లోకి రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా డెంగ్యూ వ్యాధి నుంచి విముక్తి పొందవచ్చు.

Advertisement

తాజా వార్తలు