శివలింగానికి ఎదురుగా నంది లేని ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

మన దేశంలో ప్రసిద్ధి చెందిన దేవాలయాలకు నిలయం.ముఖ్యంగా మన దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లిన ఆ శివయ్య ఆలయాలు మనకు దర్శనమిస్తాయి.

శివాలయం అనగానే మనకు గర్భగుడిలో శివలింగం శివలింగానికి ఎదురుగా ఆలయంలోనే నందీశ్వరుడు మనకు దర్శనమిస్తాడు.శివాలయం అంటేనే ఇలాంటి అదృష్టం మన కళ్ల ముందు కదులుతోంది.

అయితే మన దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ శివాలయంలో శివునికి ఎదురుగా నంది దర్శనం ఇవ్వదు.మరి ఇలాంటి ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశిష్టత ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.తమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లా, ధారసూరం అనే గ్రామంలో శ్రీ ఐరావతేశ్వర స్వామి దేవాలయం ఉంది.

ఇక్కడ మనకు రెండు ఆలయాలు దర్శనమిస్తాయి.ఒక ఆలయంలో స్వామివారి దర్శనం ఇవ్వగా మరొక ఆలయంలో అమ్మవారు దర్శనమిస్తారు.

Advertisement
Shivalinga, Nandi, Warapuram, Lokeshwara Swamy Temple,india,tamilnadu,tanjavooru

ఈ ఆలయంలో కొలువై ఉన్న స్వామివారిని రాజరాజేశ్వరుడిగా, అమ్మవారిని రాజరాజేశ్వరీ దేవిగా భక్తులు పూజిస్తారు.అయితే ఈ ఆలయాన్ని నిర్మించిన రాజు తన పేరు వచ్చే విధంగా ఈ ఆలయానికి ఐరావతేశ్వర స్వామిగా పిలువబడుతూ భక్తులకు దర్శనమిస్తోంది.

Shivalinga, Nandi, Warapuram, Lokeshwara Swamy Temple,india,tamilnadu,tanjavooru

ఇక ఆలయం విషయానికి వస్తే ఆలయం లోపలికి వెళ్లడానికి, బయట వైపు గోపుర ద్వారానికి ఎదురుగా రెండు చిన్న మండపాలు ఉంటాయి.ఈ మండపం ఒక దానిలో మనకు నందీశ్వరుడు దర్శనమిస్తాడు.ఈ ఆలయం ఈ విధంగా స్వామివారి విగ్రహానికి ఎదురుగా కొండా బయటవైపు నందీశ్వరుడు దర్శన మివ్వడం ఈ ఆలయ ప్రత్యేకత అని చెప్పవచ్చు.

ఈ ఆలయ గోడలపై ఎక్కడ కూడా ఏ మాత్రం ఖాళీ స్థలం లేకుండా అద్భుతమైన శిల్పాలు చెక్కబడి వున్నాయి.ఈ విధంగా మన దేశంలో ఎక్కడా లేని విధంగా శివలింగం, నందీశ్వరుడు వేరు వేరుగా ఉండి భక్తులకు దర్శనం కల్పిస్తూ ఉండడం ఈ ఆలయంలో చూడవచ్చు.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు