మధుమేహం నియంత్రించడానికి ఈ పువ్వుతో ఇలా చేయండి..!

భారతీయులు అరటిపండును చాలా ఇష్టంగా తింటూ ఉంటారు.ప్రతిరోజు ఆహారంలో అరటి పండును తీసుకోవడం వలన శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కూడా కలుగుతాయి.

అరటిపండు కాకుండా ఈ చెట్టు నుంచి వచ్చే పువ్వులు కూడా ఆహారాలలో వినియోగించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.అయితే ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తాయి.

ఇక మరి ముఖ్యంగా మధుమేహం( Diabetes ), ఊబకాయం, ఒత్తిడి సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు.ఈ సమస్యలతో బాధపడే వారికి పువ్వు చాలా ప్రభావంతంగా పనిచేస్తోంది.

అరటి పువ్వులో ఉండే ఫైబర్, ప్రోటీన్, పొటాషియం, కాల్షియం, కాపర్, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియంతో పాటు విటమిన్ ఈ లాంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.అందుకే ఈ పువ్వును క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వలన శరీరానికి చాలా లాభాలు కలుగుతాయి.

Advertisement

ఇక ప్రతిరోజు ఈ పువ్వును ఆహారంలో తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలగడమే కాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి.

ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలలో కూడా రక్తహీనత సమస్యలు వస్తున్నాయి.ఇలాంటి సమస్యలు రావడానికి ఐరన్ లోపమే కారణమని నిపుణులు చెబుతున్నారు.అందుకే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా అరటిని ఆహారంలో తీసుకోవాలి.

ఇందులో ఉండే గుణాలు రక్తహీనత( Anemia ) సమస్య నుండి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.అరటిపండులో మెగ్నీషియం, ఆంటీ యాక్సిడెంట్ లాంటి మూలకాలు ఉంటాయి.

ఇవి మానసిక ఒత్తిడి నుండి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.అంతేకాకుండా శరీరం చురుకుగా మారుతుంది.అరటి పువ్వుతో తయారు చేసిన డికాషన్ ప్రతిరోజు తాగడం వలన ఆకలిని నియంత్రిస్తుంది.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

అంతేకాకుండా ఇందులో ఉండే పీచు పదార్థాలు సులభంగా బెల్లీ ఫ్యాట్ ను కూడా నియంత్రిస్తాయి.అలాగే శరీరంలో పెరుగుతున్న కొలెస్ట్రాల్( Cholesterol ) ను కూడా కరిగేలా చేస్తాయి.

Advertisement

ఇక ఒత్తిడి కారణంగా చాలామంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు.ఇలాంటివారు అరటి పువ్వుతో తయారు చేసిన ఆహారాలు తీసుకుంటే రక్తపోటును నియంత్రిస్తుంది.

తాజా వార్తలు