దంతాలు ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే వారంలో 2 సార్లు ఇలా చేయండి!

దంత ఆరోగ్యం మరియు పరిశుభ్రత పై శ్రద్ధ ఎంతో అవసరం.ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించిన దంత‌ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింటుంది.

ఆ తర్వాత ఎన్నో పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.అందుకే దంతాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండాల‌ని నిపుణులు చెబుతూ ఉంటారు.

అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే చిట్కా చాలా బాగా సహాయపడుతుంది.వారంలో రెండు సార్లు అయినా ఈ చిట్కాను ప్రయత్నిస్తే దంతాలు ఆరోగ్యంగా మరియు దృఢంగా మారతాయి.

అదే స‌మ‌యంలో ఎన్నో ప్ర‌యోజనాలు సైతం ల‌భిస్తాయి.మరి ఇంతకీ ఆ చిట్కా ఏంటి అనేది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ కొబ్బ‌రి నూనె వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత అందులో రెండు చుక్కలు లవంగాల నూనె మరియు చిటికెడు ఉప్పు వేసుకుని మళ్లీ బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో దంతాలకు అప్లై చేసి సున్నితంగా రెండు నుంచి మూడు నిమిషాల పాటు తోముకోవాలి.అనంతరం దంతాల‌ను మరియు నోటిని శుభ్రంగా వాట‌ర్ తో క్లీన్ చేసుకోవాలి.

ఈ సింపుల్ చిట్కాను వారంలో రెండు సార్లు క‌నుక‌ పాటిస్తే దంతాలు దృఢంగా, ఆరోగ్యంగా మారతాయి.నోట్లో ఏమైనా బ్యాక్టీరియా ఉంటే నాశనం అవుతుంది.చిగుళ్ల నుంచి ర‌క్త‌స్రావం, చిగుళ్ల వాపు వంటి స‌మ‌స్య‌లు చాలా త్వ‌ర‌గా న‌యం అవుతాయి.

దంతక్షయానికి దూరంగా ఉండవచ్చు.దంతాల్లో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని ఈ చిట్కా అద్భుతంగా నివారిస్తుంది.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

కాబట్టి ఆరోగ్యకరమైన మరియు దృఢమైన దంతాలను కోరుకునే వారు తప్పకుండా ఈ సింపుల్ చిట్కాను పాటించండి.మంచి ఫలితాలు మీ సొంతం అవుతాయి.

Advertisement

తాజా వార్తలు