Winter Joint Pains : చలికాలం కీళ్ల నొప్పుల సమస్య తగ్గాలంటే ఇలా చేయండి..

చలికాలంలో కీళ్లు బిగుసుకుపోవడం అనేది ఈ మధ్యకాలంలో చాలామంది ప్రజలలో అధికంగా ఉన్న సమస్య.

మామూలుగా వయసు పెరిగేకొద్దీ మారుతున్న జీవన విధానం కారణంగా చాలామంది లో చాలా చిన్న వయసు నుంచే కీళ్ల సమస్యలు మొదలవుతున్నాయి.

చలికాలంలో ఈ కీళ్ల నొప్పుల సమస్య చిన్న వారి దగ్గర నుంచి పెద్దవారి వరకు ఇంకా పెరిగిపోతూ ఉంటుంది.శరీరంలో కీళ్లు సులభంగా కదలడానికి వాటి మధ్య మృదలాస్తి, సానోవియాల్ ద్రావణం లాంటివి ఉంటాయి.

నీటి శాతం తగ్గినప్పుడు లేదా సానోవియాల్ పొడిబారినప్పుడు కీళ్లు కదలడం కష్టమవుతుంది.అప్పుడు దీని వల్ల విపరీతమైన నొప్పి వచ్చే అవకాశం ఉంది.

చలికాలంలో వాతావరణంలోని చల్లదనం పెరగడం వల్ల కీళ్ల మధ్య ఉండే మృదువైన కాటిలేజ్ తగ్గడం వల్ల కీళ్ల నొప్పి ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.చలికాలంలోనీ వాతావరణంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల కీళ్ల మధ్యలో ఉండే కాటిలేజ్ తగ్గిపోతుంది.

Advertisement
Do This To Reduce The Problem Of Winter Joint Pain ,joint Pain , Winter ,Sanovia

అంతేకాకుండా చర్మం కండరాలు కూడా బిగిస్తూ పోతుంటాయి.అందుకే చాలామందికి చాలా చలికాలంలో కీళ్ల సమస్యలు ఎక్కువగా అవుతూ ఉంటాయి.

ముఖ్యంగా ఆడవారిలో రక్తహీనత కారణంగా కీళ్లనొప్పులు ఎక్కువగా ఉంటాయి.అందుకే ఈ సీజన్లో శరీరాన్ని వీలైనంత వెచ్చగా ఉంచడం ఎంతో మంచిది.

Do This To Reduce The Problem Of Winter Joint Pain ,joint Pain , Winter ,sanovia

అంతేకాకుండా కీళ్ల నొప్పులను సులభంగా తగ్గించుకోవడానికి తేలికపాటి వ్యాయామాలు చేస్తూ ఉండాలి.ఇంటి వాతావరణం ఎప్పుడు వెచ్చగా ఉండాలని చూసుకోవడం మంచిది.భుజాలు, తొడ కండరాలు గట్టిపడే వ్యాయామాలు చేస్తూ కీళ్ల పై ఒత్తిడిని పడనివ్వకుండా ఉంటే మంచిది.

అలాగే గంటల తరబడి కూర్చొని పనిచేసే వాళ్లు అప్పుడప్పుడు లేచి అటు ఇటు నడుస్తూ ఉండాలి.అంతేకాకుండా కీళ్లు మరీ బలహీనంగా ఉన్నవారు డాక్టర్స్ సలహా మేరకు కాల్షియం, విటమిన్ డి మాత్రలు ఉపయోగించడం మంచిది.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

అయితే వీటితోపాటు చలికాలంలో జంక్ ఫుడ్ తగ్గించి శరీరంలో వేడిని పెంచే ఆహారాన్ని తీసుకోవడం మంచిది.క్యాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటూ ఉండాలి.

Advertisement

శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి ప్రయత్నించడం ఎంతో మంచిది.

తాజా వార్తలు