స‌హ‌జంగానే సాఫ్ట్ అండ్ పింక్ లిప్స్‌ను పొందాల‌నుకుంటే ఇలా చేయండి!

సాధారణంగా కొందరి పెదవులు పింక్ కలర్ లో సూపర్ షైనీ గా మెరుస్తూ ఉంటాయి.

కానీ కొందరి పెదవులు మాత్రం డార్క్ గా చూపరులకు అందవిహీనంగా కనిపిస్తుంటాయి.

డీహైడ్రేషన్, కెఫిన్ ను అధికంగా తీసుకోవడం, స్మోకింగ్, ఎండల ప్రభావం, రసాయనాలు అధికంగా ఉండే లిప్ స్టిక్స్ వాడడం తదితర కారణాల వల్ల పెదాలు నల్లగా మారుతుంటాయి.దాంతో పెదాల నలుపుని ఎలా వదిలించుకోవాలో తెలియక తీవ్రంగా మదన పడుతూ ఉంటారు.

తోచిన చిట్కాలన్నిటినీ ప్రయత్నిస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇక‌పై డార్క్ లిప్స్ తో వ‌ర్రీ వద్దు.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని ఫాలో అయితే కనుక డార్క్ లిప్స్ ను సహజంగానే సాఫ్ట్ అండ్ పింక్ కలర్ లోకి మార్చుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం పెదాల నలుపును వదిలించే ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా రెండు టేబుల్ స్పూన్ల వైట్ షుగ‌ర్‌ను తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి.

Advertisement
Do This To Get Naturally Soft And Pink Lips Details! Soft Lips, Lips, Pink Lips,

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ పీనట్ బటర్ ను వేసుకోవాలి.

Do This To Get Naturally Soft And Pink Lips Details Soft Lips, Lips, Pink Lips,

అలాగే అందులో షుగర్ పౌడర్, వ‌న్‌ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని స్పూన్ తో బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసి పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం వేళ్ళతో సున్నితంగా పెదాలను రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఈ రెమెడీని వారంలో మూడు సార్లు కనుక పాటిస్తే పెదాలు ఎంత నల్లగా ఉన్నా సరే.కొద్ది రోజుల్లోనే స్మూత్ గా మరియు గులాబీ రంగులోకి మారతాయి.పైగా ఈ రెమిడీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్‌ కూడా ఉండవు.

కాబ‌ట్టి, త‌ప్ప‌కుండా ఈ రెమెడీని ట్రై చేయండి.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు