కాలసర్ప దోషం పోవాలంటే మౌని అమావాస్య రోజు ఈ చిన్న పని చేస్తే చాలు..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది మౌని అమావాస్య ఫిబ్రవరి 1వ తేదీ వచ్చింది.

ఈ క్రమంలోనే ఫిబ్రవరి 1వ తేదీ మంగళవారం ఈ అమావాస్య రావడంతో మాఘ మాసం ప్రారంభమవుతుంది.

మౌని అమావాస్యను మాఘ అమావాస్య అని కూడా పిలుస్తారు.అయితే ఈ అమావాస్యను ప్రతి ఒక్కరు ఎంతో పవిత్రమైన అమావాస్యగా భావించి పెద్ద ఎత్తున ఉపవాసంతో పూజలు చేస్తుంటారు.

కాలసర్ప దోషం ఉన్నవారు మౌని అమావాస్య రోజు కొన్ని పనులను చేయటం వల్ల కాలసర్పదోషం నుంచి విముక్తి పొందవచ్చు.మరి కాలసర్ప దోషం తొలగి పోవాలంటే ఏ విధమైనటువంటి పనులు చేయాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

మౌని అమావాస్య రోజు ఉదయమే నిద్రలేచి గంగాజలంతో స్నానం చేయడం వల్ల ఏ విధమైనటువంటి దోషాలు ఉన్నా ఆ దోషాల నుంచి విముక్తి పొందవచ్చు.అదేవిధంగా వెండితో తయారుచేసిన రెండు జంట సర్పాల విగ్రహాలను తీసుకువచ్చి వాటిని పూజించి పారుతున్న నీటిలో వేయాలి.

Advertisement
Do This Thing On Mouni Amavasya To Get Rid Of Sarpa Dosham Mouni Amavasya, Sarp

ఇలా చేయడం వల్ల కూడా కాలసర్ప దోషం నుంచి విముక్తి పొందవచ్చు.

Do This Thing On Mouni Amavasya To Get Rid Of Sarpa Dosham Mouni Amavasya, Sarp

అమావాస్య రోజు ఎవరైతే కాలసర్పదోషాలతో బాధపడుతుంటారో అలాంటివారు ఉదయాన్నే తలంటు స్నానం చేసి అనంతరం పప్పులు,మన స్తోమత కొద్దీ డబ్బును దానధర్మాలు చేయటం వల్ల ఈ విధమైనటువంటి సర్ప దోషం నుంచి విముక్తి పొందుతారు.ఇలా దానం అనంతరం శివుడిని పూజించి శివతాండవ స్తోత్రాన్ని పఠించాలి.అలాంటప్పుడు శివుని అనుగ్రహంతో కాలసర్ప దోషం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.

కాలసర్ప దోషం ఉన్నవారు పరమేశ్వరుడికి నీటిని సమర్పించి పూజించటం వల్ల కాలసర్పదోషంతో పాటు ఇతర దోషాలు కూడా తొలగిపోతాయి.

కోపాన్ని అదుపులోకి తెచ్చే బెస్ట్ టిప్స్ మీకోసం?
Advertisement
" autoplay>

తాజా వార్తలు