జుట్టు రాలే సమస్యను తరిమితరిమి కొట్టాలనుకుంటే ఇలా చేయండి..!

జుట్టు ప్రతిరోజు విపరీతంగా ఊడిపోతుందా.? ఎన్ని ప్రయత్నాలు చేసినా హెయిర్ ఫాల్( Hairfall ) కంట్రోల్ అవ్వడం లేదా.

? అధిక హెయిర్ ఫాల్ కారణంగా రోజురోజుకు జుట్టు సన్నగా మారుతుందా.? అయితే అస్స‌లు టెన్షన్ పడొద్దు.నిజానికి జుట్టు సంబంధిత సమస్యలకు చెక్‌ పెట్టే ఔషధాలు మన వంటింట్లోనే ఎన్నో ఉన్నాయి.

ముఖ్యంగా జుట్టు రాలే సమస్యను తరిమి తరిమి కొట్టాలనుకుంటే ఇప్పుడు చెప్పబోయే హెయిర్ టానిక్ ను అస్సలు మిస్ అవ్వకండి.ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు( Flax Seeds ) వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ బియ్యం,( Rice ) వన్ టేబుల్ స్పూన్ టీ పొడి మరియు ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని అందులో నైట్ అంతా నానబెట్టుకున్న బియ్యం, టీ పొడి, అవిసె గింజలను వాటర్ తో సహా వేసుకోవాలి.

అలాగే మరొక అరకప్పు వాటర్ పోసి 10 నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించండి.

Do This If You Want To Get Rid Of The Problem Of Hair Loss Details, Hair Loss,
Advertisement
Do This If You Want To Get Rid Of The Problem Of Hair Loss Details, Hair Loss,

అనంతరం స్టవ్ ఆఫ్ చేసుకుని స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసి చల్లారబెట్టుకోవాలి.ఇప్పుడు ఈ వాటర్ లో హాఫ్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేస్తే మన హెయిర్ టానిక్( Hair Tonic ) అనేది రెడీ అవుతుంది.ఈ టానిక్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

Do This If You Want To Get Rid Of The Problem Of Hair Loss Details, Hair Loss,

వారానికి ఒక్కసారి ఈ టానిక్ తయారు చేసుకుని కనుక వాడితే జుట్టు రాలే సమస్య దెబ్బకు దూరం అవుతుంది.ఈ టానిక్ జుట్టు కుదుళ్ళను బలోపేతం చేస్తుంది.జుట్టు రాలడాన్ని అరికడుతుంది.

ఆరోగ్యమైన దృఢమైన కురులను మీ సొంతం చేస్తుంది.జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.

సింహగడ్ కోటలో న్యూజిలాండ్ టూరిస్ట్‌కు చేదు అనుభవం.. బూతులు తిట్టించిన యువకులు?
హరీష్ శంకర్ ను పక్కన పెట్టేసిన రామ్ కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడా..?

పైగా ఈ టానిక్ ను వాడడం వల్ల తెల్ల జుట్టు సమస్య త్వరగా ద‌రిచేర‌కుండా ఉంటుంది.ఏజ్ పెరిగిన కూడా మీ కురులు నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తాయి.

Advertisement

తాజా వార్తలు