యూపీఐ ఎక్కువగా వాడుతుంటే ఇలా చేయండి.. లేకపోతే మీ ఎకౌంట్ ఖాళీ అవ్వడం ఖాయం

నేటి కాలంలో, డిజిటల్ చెల్లింపుల ( Digital payments )సౌకర్యం మనందరికీ బాగా అలవాటైంది.

ఆన్‌లైన్ పేమెంట్ యాప్‌ల ద్వారా మనం వేగంగా, సులభంగా లావాదేవీలను మనం చేయగలుగుతున్నాము.

అయితే, ఈ డిజిటల్ చెల్లింపుల ప్రపంచంలో హ్యాకర్లు, మోసగాళ్ల కారణంగా మన బ్యాంక్ ఖాతాల వివరాలతోపాటు మన వ్యక్తిగత సమాచారాలు ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి.విద్యుత్ బిల్లుల చెల్లింపు, రీఛార్జ్, OTT సబ్‌స్క్రిప్షన్ వంటి అనేక పనుల కోసం మనం యూపీఐ ( UPI )ద్వారా సులభంగా చెల్లింపులు చేస్తుంటాము.

అయితే, యూపీఐ ద్వారా ఆటోపే మోడ్‌ను ఉపయోగించడం కొన్నిసార్లు ప్రమాదకరం కావచ్చు.ఈ ఆటోపే మోడ్‌తో మనం తెలియకుండానే మన ఖాతా నుండి డబ్బులు మిస్ కావచ్చు.

Do This If You Are Using Upi A Lot Otherwise Your Account Will Be Empty For Sure

UPI ఆటోపే మోడ్ ( UPI Autopay Mode )అనేది ఒక ప్రత్యేక ఫీచర్.ఇది వినియోగదారులకు ఆటోమేటిక్ చెల్లింపులు చేసే అవకాశం ఇస్తుంది.ఈ ఫీచర్‌ని ఉపయోగించే వ్యక్తులు ప్రతి చెల్లింపులో UPI పిన్‌ను నమోదు చేయకుండానే చెల్లింపులు పూర్తి చేయవచ్చు.

Advertisement
Do This If You Are Using UPI A Lot Otherwise Your Account Will Be Empty For Sure

ఇందులో ఏవైనా సేవల సంబంధించి సబ్‌స్క్రిప్షన్స్, OTT ( Subscriptions, OTT )చెల్లింపులు లేదా ఇతర సర్వీసుల కోసం ఉపయోగపడుతుంది.అయితే, కొన్ని సందర్భాల్లో ఈ ఆటోపే మోడ్ మన బ్యాంక్ ఖాతా నుండి అనవసరంగా డబ్బు తీసుకోడానికి కారణం కావచ్చు.

ఉదాహరణకు, మనం ఉపయోగించని OTT యాప్‌ల కోసం ఆటోపే మోడ్ యాక్టివేట్ చేయబడితే, అవి మన ఖాతా నుండి ఆటోమేటిక్ చెల్లింపులు తీసుకుంటాయి.కాబట్టి అటువంటి తిప్పలు పడకుండా ఉండేందుకు ఆటోపే మోడ్‌ని ఎలా డిసేబుల్ చేయాలి.

అది ఎలా చేయాలంటే.

Do This If You Are Using Upi A Lot Otherwise Your Account Will Be Empty For Sure

గూగుల్ పే లేదా ఫోన్‌పే యాప్‌లో మీ ప్రొఫైల్‌కు వెళ్లండి.అక్కడ చెల్లింపుల సెక్షన్‌లో "ఆటోపే" ఆప్షన్ కనిపిస్తుంది.ఆ ఆటోపే ఆప్షన్‌పై క్లిక్ చేసి, "పాజ్" లేదా "డిలీట్" ఆప్షన్‌లను ఎంచుకోండి.

ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కాఫీ తాగితే ప్రమాదమా...

"పాజ్" ఆప్షన్‌ని క్లిక్ చేయడంతో మీరు చెల్లింపు మోడ్‌ని ఆపేయవచ్చు.మన బ్యాంక్ ఖాతా, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ల పరిరక్షణ కోసం, ఇతర అనవసర సేవలకు ఆటోపే మోడ్‌ని ఆన్ చేయకూడదు.

Advertisement

మీరు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేసే సర్వీసుల కోసం మాత్రమే ఈ ఫీచర్‌ను ఆన్ చేయాలి.

తాజా వార్తలు