మంగళవారం నాడు ఈ పనులు అసలు చేయకూడదు తెలుసా??

మంగళవారం కుజునికి సంకేతం.కుజుడు ధరిత్రి పుత్రుడు.

అందువల్ల భూమిపై నివసించే వారికి కుజ దోషం ఎక్కువగా ఉంటుంది.

కావున కుజుడు ప్రమాదాలకు, నష్టాలకు కారకుడు.

అందుకనే కుజ ప్రభావం ఉన్న మంగళవారం రోజున ఎలాంటి శుభకార్యాలు కూడా తలపెట్టారు.మంగళవారం రోజు అసలు ఏ పనులు చేయకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

మంగళవారం రోజున ఆరోగ్యానికి, ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయకూడదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Dos And Donts On Tuesday, Works, Tuesday, మంగళవారం, Nails Cutti
Advertisement
Dos And Donts On Tuesday, Works, Tuesday, మంగళవారం, Nails Cutti

మంగళవారం ఎవరికి అప్పు ఇవ్వకూడదు.అలా ఇస్తే తిరిగి ఆ డబ్బులు మనకి రావు.ఒకవేళ అప్పు తీసుకున్నా అవి అనుకున్న కార్యానికి కాకుండా వేరే విధంగా ఖర్చవుతాయి.

మంగళవారం రోజున గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు.అలా చేయడం ద్వారా కుటుంబంలో కలహాలు జరుగుతాయి.

అలాగే మంగళవారం కొత్త బట్టలు ధరించకూడదు.మరీ ముఖ్యమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదు.

మంగళవారం ఉపవాస దీక్షలు చేసే వారు రాత్రి పూట ఉప్పు లేని ఆహారాన్ని తీసుకోవాలి.మంగళవారం మాంసాహారం దీనికి దూరంగా ఉండడం మంచిది.

సంక్రాంతి నాడు గాలిపటం ఎందుకు ఎగుర వేస్తారు?

మాంసాహారాన్ని తీసుకొనే వారి ఇంట శ్రీ మహాలక్ష్మి దేవి నివాసం ఉండదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.మంగళవారం రోజున ఇంట్లో అసలు ఘర్షణలకు, గొడవలకు తావు ఇవ్వకూడదు ఇలా చేయడం ద్వారా ఇంటి యజమానికి ఆయుష్షు తగ్గుతుంది.

Advertisement

దంపతులు మంగళవారం, శుక్రవారాలలో వివాదాలకు దూరంగా ఉండడం ఎంతో మంచిదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.అయితే మంగళవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం ద్వారా శుభ ఫలితాలు జరుగుతాయి.

తాజా వార్తలు