New Broom : పొరపాటున కూడా ఆ సమయంలో కొత్త చీపురుని ఇంటికి తీసుకురాకూడదు..!

మనం ప్రతిరోజు ఇంట్లో ఉపయోగించే చీపురు విషయంలో, వాస్తు శాస్త్రంలో ఎన్నో రకాల విషయాలు చెప్పబడ్డాయి.

అయితే తెలిసి, తెలియకుండా ఈ చీపురు విషయంలో కొన్ని రకాల తప్పులు చాలామంది చేస్తూ ఉంటారు.

ఇలా చేయడం వలన మానసికంగా, ఆరోగ్యంగా, ఆర్థికపరంగా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.మనం ఇంటి నిర్మాణానికి ఇంట్లో పెట్టుకునే వస్తువులు ఏ విధంగా అయితే వాస్తు నియమాలను పాటిస్తామో అదేవిధంగా ఇంట్లో చీపురు విషయంలో కూడా కొన్ని వాస్తు నియమాలు పాటించాలి.

అయితే చీపురును మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు.అలాంటి చీపురును ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి తీసుకురాకూడదు.

ఇక చీపురును ఎక్కడపడితే అక్కడ కూడా ఉంచకూడదు.

Do Not Bring Home A New Broom At That Time Even By Mistake
Advertisement
Do Not Bring Home A New Broom At That Time Even By Mistake-New Broom : పొ�

చీపురును ఈశాన్యం మూల, ఆగ్నేయం మూలలో పొరపాటున కూడా ఉంచకూడదు.ఇక నైరుతి, వాయువ్య మూలలో చీపురును కనిపించకుండా పెట్టాలి.చీపురు విషయంలో ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పాత చీపురు పాడైపోయినప్పుడు చీపురును కొనుగోలు చేయాలనుకునేవారు ఎప్పుడు పడితే అప్పుడు కొత్త చీపురును కొనుగోలు చేయకూడదు.అయితే శనివారం నాడు కొత్త చీపురును కొనుగోలు చేసుకుని ఇంటికి తెచ్చుకుంటే మంచిది.

అలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.ఇక పొరపాటున కూడా శుక్లపక్షంలో చీపురును కొనుగోలు అస్సలు చేయకూడదు.

కేవలం కృష్ణ పక్షంలో మాత్రమే చీపురును కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు.

Do Not Bring Home A New Broom At That Time Even By Mistake
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 29, మంగళవారం 2025

ఒకవేళ పొరపాటున కూడా శుక్లపక్షంలో ఎవరైనా చీపురును కొనుగోలు చేస్తే దురదృష్టానికి హేతువుగా మారిపోతుంది.అప్పుడు చీపురు కొన్నవారికి ఊహించని ఎన్నో కష్టాలు జీవితంలో వచ్చి పడతాయి.అంతేకాకుండా శుక్రవారం నాడు, మంగళవారం నాడు, మహాలయ పక్షం సమయాల్లో అంటే భాద్రపద మాసంలోని పౌర్ణమి నుండి అమావాస్య రోజుల్లో చీపురును కొనుగోలు చేయడం ఏ విధంగాను కూడా మంచిది కాదు.

Advertisement

కాబట్టి పొరపాటున కూడా చీపురుకు సంబంధించిన తప్పులు అస్సలు చేయకూడదు.అలా చేయడం వలన ధనవంతుల నుండి పేదరికం పెట్టడానికి ఎక్కువ సమయం పట్టదు.కాబట్టి చీపురును కొనుగోలు చేసే విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి.

తాజా వార్తలు