మీ చేతులలో నుంచి చిన్న చిన్న వస్తువులు కూడా కింద పడిపోతున్నాయా? అయితే ఈ సమస్య కావచ్చు..!

ఈ మధ్యకాలంలో చాలామంది ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.తినే ఆహారం, జీవన శైలి తదితర కారణాలవల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే మీ చేతులు పట్టు తప్పిపోతున్నాయా, అయితే మీరు త్వరలోనే అనారోగ్య సమస్యకు గురవుతారని భావించాలి.మీ చేతుల్లోంచి తరచూ వస్తువులు జారీ కింద పడిపోతున్నాయా, అయితే మీరు గుండెకు సంబంధించన, నాడీ వ్యవస్థకు,నరాల పటుత్వానికి సంబంధించిన అనారోగ్యానికి గురవుతారని అర్థం చేసుకోవచ్చు.

సాధారణంగా ఇలా చెయ్యి పట్టు చిక్కకపోవడాన్ని, పట్టు జారిపోవడాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు.తరచూ చేతుల్లోంచి చిన్న చిన్న వస్తువులు కూడా జారి కింద పడిపోవడాన్ని కూడా ఎవరు పట్టించుకోరు.

కానీ మీ శరీరానికి సంబంధించిన అనేక రకాల రుగ్మతలకు, అనారోగ్యా సమస్యలకు ఇలా పట్టు జారిపోవడాన్ని సూచనగా భావించాలని చెబుతున్నారు.ఈ మధ్యకాలంలో జనరల్ ఆఫ్ ఆల్జీమర్స్( General of Alzheimers ) లో ప్రచురితమైన ఒక ప్రత్యేకమైన అధ్యయనం ప్రకారం ఈ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

Advertisement

మీ చేతిలో పట్టు తప్పిపోవడం, పట్టు జారిపోవడం త్వరలోనే మీకు చిత్తవైకల్యానికి సంబంధించిన జబ్బులు రావడానికి సూచనగా భావించాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

30 సంవత్సరాల వయసు ఉన్న ఒక వ్యక్తి సాధారణంగా కనీసం 40 కేజీల బరువును సులభంగా మోయగలడు.దానిపై తనకు కచ్చితంగా పట్టు ఉంటుంది.ఈ సామర్థ్యం ఎంతో కొంత తగ్గినా సరే ఖచ్చితంగా అది రాబోయే రోజుల్లో అనారోగ్యానికి సంకేతం అని వైద్యులు చెబుతున్నారు.

దాదాపు ప్రతి మనిషికి ఒక శతాబ్దానికి మూడు నుంచి ఐదు శాతం మజిల్ మాస్ పవర్( Muscle mass power ) తగ్గిపోతుందని వైద్య విజ్ఞాన శాస్త్రవేత్తలు ( Medical scientists )వెల్లడించారు.శరీరంలోని మిగతా అవయవాల పట్టుత్వం కోసం రోజు వ్యాయామం చేసే వాళ్లే తప్ప,చేతుల మణికట్టులోని కండరాల పటుత్వాన్ని పెంచుకోవడానికి వ్యాయామం చేసే దాదాపు చాలా తక్కువే అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కేవలం చిన్నచిన్న గ్రిప్పులు, స్మైలీ బాల్స్ సహాయంతో రోజు కొంతసేపు ప్రత్యేకంగా చేతి కండరాలను బలపరుచుకునేందుకు వ్యాయామం చేయడం ఎంతో మంచిది.

పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...
Advertisement

తాజా వార్తలు