వైసీపీలోకి జ‌గ‌న్ శ‌త్రువు..!

ఏపీలో 2019 ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతోన్న కొద్ది ఇక్క‌డ రాజ‌కీయాలు బాగా హీటెక్కిపోతున్నాయి.2019 ఎన్నిక‌ల వేళ త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు ఎవ‌రికి వారు ఏదో ఒక పార్టీలో చేరిపోతూ టిక్కెట్ట కోసం ర‌క‌ర‌కాల గేమ్‌ప్లాన్స్ అమ‌లు చేస్తున్నారు.

నిన్న‌టి వ‌ర‌కు అధికార టీడీపీలోకి విప‌క్ష వైసీపీ ఎమ్మెల్యేలు వ‌రుస‌పెట్టి జంపింగ్ చేసేశారు.

ఓవ‌రాల్‌గా 21 మంది ఎమ్మెల్యేలు అధికార టీడీపీ గూటికి చేరిపోయారు.ఇప్పుడిప్పుడే ఇత‌ర పార్టీల‌తో పాటు కాంగ్రెస్‌లో ఉన్న వారు, ఖాళీగా ఉన్న సీనియ‌ర్లు విప‌క్ష వైసీపీ గూటికి చేరిపోతున్నారు.

DL Ravindra Reddy To Join YCP-DL Ravindra Reddy To Join YCP-Telugu Political New

ఈ క్ర‌మంలోనే దివంగ‌త మాజీ సీఎం వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డితో పాటు ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్‌కు శ‌త్రువుగా ఉన్న ఓ సీనియ‌ర్ సైతం అదే జ‌గ‌న్ గూటికి చేరిపోతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌, సీమ‌కు చెందిన డీఎల్ ర‌వీంద్రా రెడ్డి కూడా జ‌గ‌న్ పంచ‌కే చేరుతున్న‌ట్టు అధికారికంగా తెలిసింది.ఈ విష‌యంపై రేపోమాపో ఆయ‌నే అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు.

Advertisement

ఇక డీఎల్ క‌డ‌ప జిల్లా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో సైతం వైసీపీ అభ్య‌ర్థి, జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్‌.వివేకానంద‌రెడ్డికే మ‌ద్ద‌తు ఇవ్వ‌నున్నారు.గ‌తంలో డీఎల్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డితో ఎప్పుడూ విబేధిస్తూ ఉండేవారు.

క‌డ‌ప ఉప ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మీద స‌వాల్ చేసి పోటీలోకి దిగి మ‌రీ ఓడిపోయారు.డీఎల్ వైసీపీలో చేరితే అది సొంత జిల్లాలో జ‌గ‌న్‌కు పెద్ద ప్ల‌స్ పాయింటే.

ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో డీఎల్ మైదుకూరు నుంచే పోటీ చేసే ఛాన్సులు ఉన్నాయి.అదే జ‌రిగితే అక్క‌డ సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డికి ఎర్త్ త‌ప్ప‌దు.

తాజా వార్తలు