డీజే పెట్టి స్టెప్పులు.. 119 ఏళ్ల వృద్ధుడికి అదిరిపోయే అంతిమయాత్ర

ఎవరైనా చనిపోతే ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంటుంది.కుటుంబ సభ్యుడిని కోల్పోయిన బాధ ప్రతి ఒక్కరిలో ఉంటుంది.

కన్నీరు మున్నీరుగా విలపిస్తారు.తన కుటుంబంలోని ఆ వ్యక్తిని కోల్పోతే ఆ వ్యక్తి స్మృతులను గుర్తు చేసుకుంటారు.

ఇంట్లోని వ్యక్తి కానరాని లోకాలకు వెళ్లడం వారిని తీవ్ర నైరాశ్యంలోకి నెడుతుంది.అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలుకుతారు.

కన్నీటి పర్యంతం అవుతూ అంతిమయాత్ర నిర్వహిస్తారు.మృతదేహానికి సంప్రదాయం ప్రకారం కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Advertisement

శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు జరుపుతారు.కానీ పశ్చిమ బెంగాల్ లో జరిగిన అంతిమ యాత్ర ఇప్పుడు చర్చనీయాశంగా మారింది.

 డీజే పాటలు, డ్యాన్సుల మధ్య అంతిమయాత్ర నిర్వహించారు.కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కలిసి చిందులు వేశారు.

పశ్చిమ బెంగాల్.ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఓ 119 ఏళ్ల వృద్ధుడి అంతిమయాత్రలో జరిగింది ఇదంతా.

కుమ్రా గ్రామానికి చెందిన డెబెన్ హజ్రా వయస్సు 119 సంవత్సరాలు.వృద్ధాప్యంతో ప్రాణాలు కోల్పోయారు.అయితే డెబెన్ హజ్రాకు సంగీతం అంటే చాలా ఇష్టమట.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Betway: Practical Guide To Player Safety And Responsible Gambling

చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా నాటకాలు జరిగితే తప్పకుండా వెళ్తారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.ఇంట్లో కూడా ఎక్కువ సమయం పాటలు పాడుతూ ఆనందంగా ఉండే వారట.

Advertisement

అందుకే హజ్రా మృతి చెందిన తర్వాత అంతిమ యాత్రలో డీజే సౌండ్స్ పెట్టించి డ్యాన్సులు చేసినట్లు చెబుతున్నారు కుటుంబ సభ్యులు.డీజే హోరులో ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ గ్రామంలో ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.