సైనేజ్ బోర్డ్స్ బహుకరణ

యాదాద్రి జిల్లా:యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఎంపీఎల్ స్టీల్ అండ్ పైప్స్ కంపెనీ వారు ట్రాఫిక్ అవేర్నెస్ కు సంబంధించిన సైనేజ్ బోర్డ్స్ ని స్పాన్సర్ చేయడం జరిగినది.

ఇందులో కంపెనీకి చెందిన బ్రాండ్ మేనేజర్ మిస్టర్ కార్తీక్,వారి సిబ్బందితో పాటు వచ్చి ట్రాఫిక్ అవగాహనకు సంబంధించినటువంటి ఆరు రకముల సైనేజ్ బోర్డ్స్ యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాదగిరిగుట్ట,ఆలేర్ మోటకొండూర్,గుండాల,రాజపేట్ మరియు తుర్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఆరు రకములు ట్రాఫిక్ వైలేషన్స్ కి సంబంధించిన బోర్డ్స్ నీ ప్రధాన కూడళ్ళలో అలాగే రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో వీటిని పెట్టడం జరుగుతుందని ట్రాఫిక్ సిఐ శివశంకర్ గౌడ్ తెలిపారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఎక్కువ మరణాలు రోడ్డు ప్రమాదాల కారణంగానే జరుగుతున్నందున ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కల్పించడం ఎంతైనా అవసరం కాబట్టి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీలైనంత అవగాహన కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేలా ట్రాఫిక్ రూల్స్ గురించి అన్ని తెలిసేలా చేయాలని భావిస్తున్నామని,దానికి ఇలా కొంతమంది ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.వారికి,యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఐలు లక్ష్మీనారాయణ,మహేష్,శివకుమార్,ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

Bet365 бонусная программа: разбор механик, ограничений и реальной ценности
Advertisement

Latest Yadadri Bhuvanagiri News