కాకినాడ జిల్లా ప‌రిష‌త్ స‌మావేశంలో ర‌సాభాస‌

కాకినాడ జిల్లా ప‌రిష‌త్ స‌మావేశం రసాభాసగా మారింది.మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ‌, అధికార పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మ‌ధ్య మాట‌ల యుద్ధం చెల‌రేగింది.

స‌మావేశంలో భాగంగా జ‌గ్గంపేట ఎమ్మెల్యే కౌలు రైతుల స‌మస్య‌ల‌పై మంత్రిని నిల‌దీసారు.అనంతరం జీవోల గురించి తెలుస‌ని.

కొత్త‌గా చెబుతారా అని ప్ర‌శ్నించారు.మంత్రిగా నిర్ణ‌యం తీసుకోలేన‌ప్పుడు తీర్మానం చేసి ప్ర‌భుత్వానికి పంపాల‌ని సూచించారు.

అదేవిధంగా జెడ్పీటీసీల‌కు జెడ్పీ కార్యాల‌యంలో ఛాంబ‌ర్లు కేటాయించాల‌ని కోరారు.దీనిపై స్పందించిన మంత్రి చెల్లుబోయిన పంచాయ‌తీ రాజ్ చ‌ట్టం ప్ర‌కార‌మే తాము న‌డుస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

Advertisement

ప్ర‌భుత్వంలో ఉంటూ ఇలా మాట్లాడటం ఏంట‌ని ప్ర‌శ్నించారు.అధికార పార్టీ ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఈ విధంగా మాట్లాడ‌టం స‌రికాద‌ని వారించారు.

దీంతో స్వ‌ల్ప ఉద్రిక్త‌త నెలకొంది.

Advertisement

తాజా వార్తలు