టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డి నియామ‌క అర్హ‌త‌పై రిట్ పిటిష‌న్ కొట్టివేత‌

టీటీడీ ఈవోగా ధ‌ర్మారెడ్డికి అన్ని అర్హ‌త‌లు ఉన్నాయ‌ని ఏపీ హైకోర్టు తెలిపింది.

ఈ మేర‌కు ఆయ‌న నియామ‌క అర్హ‌త‌పై దాఖలైన రిట్ పిటిష‌న్ ను న్యాయ‌స్థానం కొట్టివేసింది.

దేవాదాయ శాఖ చ‌ట్టం ప్ర‌కారం టీటీడీ ఈవోగా నియ‌మించేందుకు ధ‌ర్మారెడ్డికి అర్హ‌త ఉంద‌ని స్ప‌ష్టం చేసింది.టీటీడీ అద‌న‌పు ఈవోగా ఉన్న ధర్మారెడ్డికి.

ఈవోగా పూర్తి అద‌న‌పు బాధ్య‌తలు అప్ప‌గించ‌డాన్ని స‌వాల్ చేస్తూ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైన విష‌యం తెలిసిందే.దేవదాయ చట్టంలోని 107వ సెక్షన్‌ ప్రకారం.

జిల్లా కలెక్టర్‌ లేదా ఆ ర్యాంకుకు తగ్గని అధికారికి మాత్రమే ఈవోగా బాధ్యతలు చేపట్టేందుకు అర్హత ఉందని చెప్పారు.ధర్మారెడ్డి ఈవోగా బాధ్యతలు నిర్వర్తించకుండా నిలువరించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Advertisement

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధ‌ర్మాస‌నం ఈవోగా ధర్మారెడ్డిని నియమించేందుకు అర్హతలు ఉన్నాయని పిటిషన్‌ను కొట్టేసింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 5, ఆదివారం 2023
Advertisement