కల్కి బ్లాక్ బస్టర్ హిట్టైనా ఆమెకు మాత్రం లాభం లేదా.. ఆ పాత్రకు ఎవరైనా ఒకటే అంటూ?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం కల్కి.

నాగ్ అశ్విన్( Nag Ashwin ) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

ఇకపోతే ఈ సినిమాలో చాలామంది సెలబ్రిటీలు నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాలో ఎన్ని పాత్రలు ఉన్నాయో లెక్క పెట్టి చెప్పడం చాలా కష్టం.

ముఖ్య పాత్రలో నటించిన వారితో పోల్చుకుంటే అతిథి పాత్రలు చేసిన వాళ్ల లిస్టే చాలా పెద్దది అని చెప్పాలి.

విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, అనుదీప్ కేవీ ఇలా చాలామంది సినిమాలో కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.అయితే క్యామియోస్‌లో కొన్ని వర్కవుట్ అయ్యాయి.క్యారెక్టర్ రోల్స్ చేసిన వాళ్లలో కొందరు తమ ప్రాధాన్యాన్ని చాటుకున్నారు.

Advertisement

ఇక ప్రధాన పాత్రలు చేసిన వాళ్లందరూ కూడా తమదైన ముద్ర వేశారు.కానీ ఇందరి మధ్య రాక్సీ పాత్ర చేసిన బాలీవుడ్ హీరోయిన్ దిశా పఠాని( Disha patani ) మాత్రం కనీస స్థాయిలో కూడా గుర్తింపు సంపాదించలేకపోయింది.

ఆమె పాత్ర సినిమాలో ఉన్నా లేకపోయినా ఒకటే అన్న ఫీలింగ్ కలిగింది ప్రేక్షకులకు.

సినిమా చూసి బయటికి వచ్చిన వాళ్లు వివిధ పాత్రలు, వాటిని పోషించిన నటీనటుల గురించి మాట్లాడుకుంటున్నారు.కానీ ఎవ్వరూ దిశా పఠాని గురించి పెద్దగా ప్రస్తావించట్లేదు.సినిమాలో ప్రభాస్‌ చేసిన భైరవ పాత్రను ఇష్టపడే అమ్మాయి పాత్రలో తను కనిపించింది.

కానీ ఆ రొమాన్స్ వర్కవుట్ కాలేదు.ఇద్దరి మధ్య బంధాన్ని తెలిపేలా సన్నివేశాలు రాసుకోలేదు నాగ్ అశ్విన్.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo

ప్రభాస్-దిశా మీద ఒక పాట తీసినా అందులో ఆమె గ్లామరస్‌‌గా కనిపించినా పెద్దగా ఇంపాక్ట్ లేకపోయింది.ఆ పాట అవ్వగానే దిశ పాత్ర అంతర్ధానం అయిపోతుంది .తర్వాత ఎక్కడా కనిపించదు.అందరూ ఆమెను మరిచిపోతారు.

Advertisement

సినిమా నుంచి బయటికి వచ్చాక దిశగా తలుచుకునేవాళ్లే లేరు.

తాజా వార్తలు