సెన్సార్ పూర్తి చేసుకున్న డిస్కో రాజా! డబుల్ రోల్ తో మరో సారి హిట్ కొడతాడా

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విభిన్న కథా చిత్రం డిస్కో రాజా.

పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ కి, ప్రెజెంట్ కి కనెక్ట్ చేస్తూ తీసిన ఈ సినిమా మరో సారి రవితేజ కెరియర్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రంగా రాబోతుంది.

ఎక్కువగా హీరోయిక్ కమర్షియల్ సినిమాలు చేస్తూ ఒకే తరహా కథలతో విసుగుపుట్టించిన రవితేజ లైన్ మార్చుకొని చేసిన సినిమా డిస్కో రాజా కావడం విశేషం.ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన కొన్ని పాటలు, టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చి డిఫరెంట్ ఫీల్ ని అందించాయి.

Disco Raja Got Ua Sensor Certificate-సెన్సార్ పూర్త�

దీంతో సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి యూఏ సర్టిఫికేట్ ను మంజూరు చేశారు.ఈ నెల 24వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

Advertisement

కచ్చితంగా హిట్ గ్యారెంటీ అనే పోజిటివ్ ఫీడ్ బ్యాక్ తో రవితేజ కెరియర్ లో ఫస్ట్ టైం ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయ్యింది.ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ ని కూడా చిత్ర యూనిట్ మొదలెట్టింది.

ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తుండగా, ఆయన సరసన నభా నటేశ్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.తాన్యా హోప్ కీలక పాత్రలో కనిపిస్తుంది.

బాబి సింహా ఈ సినిమాలో విలన్ గా సందడి చేస్తున్నాడు.మరో భారీ అంచనాల మధ్య రిలీజ్ కి సిద్ధం అవుతున్న ఈ సినిమా రవితేజ ద్విపాత్రాభినయం చేసిన సినిమాల తరహాలో సూపర్ హిట్ ఇస్తుందేమో చూడాలి.

మెడ నొప్పిని వేగంగా తగ్గించుకోవటం ఎలా
Advertisement

తాజా వార్తలు