ఏపీ ఉద్యోగ సంఘాల మధ్య తీవ్రస్థాయికి విభేదాలు

ఏపీ ఉద్యోగ సంఘాల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి.ఉద్యోగ సంఘాలు రెండుగా విడిపోవడంతో వివాదాలు రచ్చకెక్కాయి.

ఉద్యోగ సంఘాలు, ఎన్జీవోల మధ్య యుద్ధం నడుస్తోంది.ఈ క్రమంలోనే సమయానికి జీతాలు సైతం ఇవ్వడం లేదని ఉద్యోగ సంఘం నేతలు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

అయితే ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు గవర్నర్ ను కలవడంపై ఏపీ ఎన్జీవో తీవ్రస్థాయిలో మండిపడుతోంది.సర్వీస్ రూల్స్ కు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

మరోవైపు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం కూపీ లాగుతోంది.ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ వెనుక ప్రతిపక్ష పార్టీలు ఉన్నట్లు సర్కార్ అనుమానం వ్యక్తం చేస్తోంది.

Advertisement

ఈ నేపథ్యంలోనే గవర్నర్ అపాయింట్ మెంట్ ఎవరు ఇప్పించారన్న అంశంపై ప్రభుత్వం దృష్టి సారించిందని సమాచారం.

ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ డిమాండ్స్ నెట్టింట వైరల్.. ఆమె డిమాండ్లు ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు