పుష్ప2 సినిమా పై ఫైర్ అయిన డైరెక్టర్.. ఇది మంచి పద్ధతి కాదంటూ కామెంట్స్!

అల్లు అర్జున్ ( Allu Arjun )నటించిన పుష్ప 2 ( Pushpa 2 ) దేశవ్యాప్తంగా ఎంతో అద్భుతమైన ఆదరణను సొంతం చేసుకుని ఈ సినిమా విడుదలైన వారం రోజులలో ఏకంగా వెయ్యి కోట్లకు పైగా  కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది.

ఇలా ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ఎంతో మంచి ఆదరణ వస్తున్న నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ ఈ సినిమా విషయంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

తాజాగా దర్శకుడు విక్రమాదిత్య మోత్వానే ( Vikramaditya Mothwane ) ఈ సినిమాపై ఘాటుగా విమర్శల వర్షం కురిపించారు.ఈ సందర్భంగా ఈ సినిమా గురించి ఈయన సుదీర్ఘమైన పోస్ట్ చేస్తూ మండిపడ్డారు.

Director Vikramaditya Mothwani Fire On Pushpa 2 Movie Multiplex Screening, Push

పుష్ప-2 నిస్సందేహంగా బ్లాక్ బస్టర్ మూవీ.కానీ 3 గంటల 20 నిమిషాల నిడివి కారణంగా నార్మల్ కంటే థియేటర్లలో ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఆక్రమిస్తుందని తెలిపారు.విడుదలైన పది రోజులకు కూడా మల్టీప్లెక్స్ లలో ఈ సినిమాని కాకుండా మరో సినిమాని వేయకూడదు అనే కాంట్రాక్టు కుదుర్చుకున్నారని.

వేరే సినిమా కోసం ఒక్క షో వేసినా తమపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఓ ప్రముఖ మల్టీప్లెక్స్‌ చైన్ మేనేజర్ చెప్పినట్టు ఈయన ఈ లేఖలో పేర్కొన్నారు.

Director Vikramaditya Mothwani Fire On Pushpa 2 Movie Multiplex Screening, Push
Advertisement
Director Vikramaditya Mothwani Fire On Pushpa 2 Movie Multiplex Screening, Push

ఇలా మల్టీప్లెక్స్ లను కాంట్రాక్టు కింద కుదుర్చుకోవడం అనేది భయంకరమైన గుత్తాధిపత్యం అని ఈయన తెలిపారు.ఈ విషయాన్ని ఇలాగే వదిలేస్తే ఇది ఒక వినాశనానికి కారణం అవుతుందని విక్రమాదిత్య పేర్కొన్నారు.ఇలా ఈ సినిమా కోసం పది రోజులపాటు మల్టీప్లెక్స్ లో అన్ని స్క్రీన్ లను ఆక్రమించటం వల్ల గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్-2025 కు నామినేట్ చేయబడిన ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రానికి స్క్రీన్స్ లభించలేదన్నారు.

ఇలా ఒకే సినిమాకే మల్టీప్లెక్స్ అన్నీ కూడా పరిమితం అవడంతో ఎన్నో మంచి సినిమాలను ప్రేక్షకులు కోల్పోతారని ఇలా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అద్భుతమైన మరో సినిమా ఆడుతోందనే విషయం కూడా ప్రేక్షకులకు తెలీదు.అభినందనలు.

మేము దీనికి అర్హులం అంటూ ఈయన సెటైరికల్ పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు