టీడీపీలోకి వినాయక్‌... ఎమ్మెల్యేగా పోటీ..?

టాలీవుడ్‌లో మాస్ చిత్రాల‌కు కేరాఫ్ స్టార్ డైరెక్ట‌ర్ వివి.వినాయ‌క్‌.

వ‌రుస‌గా మాస్ చిత్రాలు డైరెక్ట్ చేస్తోన్న వినాయ‌క్‌కు అఖిల్ సినిమాతో ఘోర‌మైన అవ‌మానం మిగిలింది.

చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150 ‘ వంటి హిట్ చిత్రంతో ఫామ్‌లోకి వ‌చ్చాడు.

ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత అగ్ర హీరోలు ఎవ్వ‌రూ ఖాళీగా లేక‌పోవ‌డంతో వినాయ‌క్ ప్ర‌స్తుతం మ‌రో మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌తో ద‌ర్గ సినిమా చేస్తున్నాడు.బాక్సాఫీస్ సెన్సేష‌న్‌గా పేరున్న వి.వి.వినాయ‌క్ రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారా ? అంటే అవున‌న్న ఆన్స‌రే ఆయ‌న తాజా వ్యాఖ్య‌ల‌తో వ్య‌క్త‌మ‌వుతోంది.వినాయ‌క్ తండ్రి గ‌తంలో వాళ్ల స్వ‌గ్రామం చాగ‌ల్లు సర్పంచ్‌గా కూడా ప‌నిచేశారు.

ఇక తాజాగా ఆయ‌న త‌న సొంత జిల్లా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని తిమ్మ‌రాజుపాలెం స‌ర్పంచ్ స‌త్య‌వ‌తి ఇటీవ‌ల మృతిచెందారు.ఆమె కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన వినాయ‌క్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ తన రాజ‌కీయ‌ రంగ ప్రవేశం గురించి ప్ర‌క‌టించారు.

Advertisement

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ దేవుడు శాసిస్తే రాజ‌కీయాల్లోకి వ‌స్తాను.అస‌లు డైరెక్ట‌ర్‌న‌వుతాన‌నుకోలేదు.అయినా అయ్యాను.

ఇక రాజ‌కీయాల్లో వెళ్లే టైం కూడా దగ్గ‌ర ప‌డింద‌ని చెప్పారు.ఈ వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి వినాయ‌క్‌కు రాజ‌కీయాలంటే ఇష్ట‌మ‌ని.

ఆయ‌న త్వ‌ర‌లోనే రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే టైం ద‌గ్గ‌ర‌ప‌డింద‌ని చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి.వినాయ‌క్ ఏ పార్టీలో చేర‌తారు? ఒకవేళ వినాయక్ రాజకీయాల్లోకి వెళితే సినిమాల డైరెక్షన్ ఆపెస్తాడా ? అనేది మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ అయితే లేదు.ఇక వినాయక్ గ‌తంలో కాంగ్రెస్‌కు స‌న్నిహితంగా ఉండేవారు.

వైఎస్ సీఎంగా ఉన్న‌ప్పుడే ఆయ‌న త‌న తండ్రిని చాగ‌ల్లు స‌ర్పంచ్‌గా గెలిపించుకున్నారు.ఇక ఇప్పుడు వినాయ‌క్ చూపు టీడీపీ వైపు ఉన్న‌ట్టు తెలుస్తోంది.

టీడీపీ నుంచి ఆహ్వానాలు ఉందడం, బాల‌య్య త‌న‌కు స‌న్నిహితుడు కావ‌డంతో ఆయ‌న ఆ పార్టీలో చేరి ఈస్ట్ లేదా వెస్ట్ గోదావ‌రి జిల్లాల్లో ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది.టీడీపీలోకి వినాయక్‌.

Advertisement

ఎమ్మెల్యేగా పోటీ.?.

తాజా వార్తలు