హరికృష్ణ మనవడిని పరిచయం చేయాలనుకుంటున్న తేజ

ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఎంతో మందిని హీరోలుగా పరిచయం చేసిన దర్శకుడు తేజ( Director Teja ).

ఈయన గత కొంత కాలంగా సరైన ఫామ్ లో లేడు.

చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ఒక కొత్త హీరోను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడు.దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన అభిరామ్‌ ను హీరోగా దర్శకుడు తేజ పరిచయం చేస్తూ అహింస అనే సినిమాను రూపొందించాడు.

సురేష్ బాబు( Suresh Babu ) తనయుడు అయిన అభిరామ్‌( Abhiram ) తో రూపొందించిన అహింస సినిమాను వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా తేజ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ బయోపిక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

సీనియర్‌ ఎన్టీఆర్ ( Senior NTR )యొక్క బయోపిక్‌ ను రూపొందించాలని అప్పుడు అనుకున్నాను.

Advertisement

బాలయ్య( Balayya ) తో బయోపిక్ ను రూపొందించే ఉద్దేశ్యంతో ప్రకటన కూడా వచ్చింది.కానీ కొన్ని కారణాల వల్ల బయోపిక్ ను వదిలేశాను.ఆ సమయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను అనిపించింది.

అయితే ఎన్టీఆర్‌ బయోపిక్( NTR biopic ) ను ఇప్పటికి అయినా చేసేందుకు ఆసక్తిగా ఉన్నాను.అయితే సినిమా అన్నట్లుగా కాకుండా సిరీస్‌ రూపంలో తీసుకు వస్తాం అంటూ తేజ ప్రకటించాడు.

అయితే సిరీస్ లో ఎవరు నటిస్తారు అనే విషయమై ఆయన నుండి ఆసక్తికర సమాధానం లభించింది.తేజ యొక్క ఎన్టీఆర్‌ వెబ్‌ సిరీస్‌ లో టైటిల్‌ రోల్‌ ను ఎన్టీఆర్ తో చేయించబోతున్నాడట.

ఈ ఎన్టీఆర్‌ మూడవ తరం ఎన్టీఆర్‌.హరికృష్ణ కొడుకు అయిన ఎన్టీఆర్‌ ను హీరోగా ఈ వెబ్‌ సిరీస్ తో పరిచయం చేయాలని తేజ భావిస్తున్నాడట.

కొద్ది పాటి చ‌లికే వ‌ణికిపోతున్నారా? అయితే మీరివి తెలుసుకోవాల్సిందే!

ఎన్టీఆర్ చూడ్డానికి సీనియర్‌ ఎన్టీఆర్‌ మాదిరిగానే ఉంటాడు అంటూ తేజ చెప్పుకొచ్చాడు.అయితే ఈ సిరీస్‌ ఎప్పుడు మొదలు అవుతుంది అనేది ఆయన క్లారిటీ ఇవ్వలేదు.

Advertisement