ఎన్టీఆర్ బయోపిక్ గురించి అడగగానే ఆ ఒక్క మాటతో అందరి నోటికి తాళం వేసిన తేజ.! ఏమన్నారంటే.?

నందమూరి ఎన్టీఆర్ అంటేనే భారతీయత ఉట్టిపడేలా ఉంటుంది.తెలుగుదనం ప్రత్యక్షంగా కనిపిస్తుంది.

తెలుగు జాతి ఉన్నంత వరకూ ఆయన ఖ్యాతి ఉంటూనే ఉంటుంది.

తెలుగు చిత్ర సినిమాకి ఎంతో గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్ జీవిత చరిత్రని ఆయన తనయుడు హీరో ,ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ బయోపిక్ రూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించారు.

అన్న గారి పాత్రలో బాలయ్య బాబు గారు ఒదిగిపోయారు అంటున్నారు సినిమా చూసిన వారంతా.

అయితే ఈ సినిమాని మొదట తేజ దర్శకత్వం వహించనున్నారు అనే వార్తలు వచ్చాయి.సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టారు.కానీ తర్వాత వివాదాల వల్ల తేజ తప్పుకున్నారు.

Advertisement

క్రిష్ దర్శకత్వం వహించారు.ఎన్టీఆర్ బయోపిక్ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత తేజ వివాదాలకు దూరంగానే ఉంటూ వచ్చారు.

ఎందుకు తప్పుకున్నారు అనేది ఎప్పుడు వెల్లడించలేదు.

అయితే సంక్రాంతికి ‘ఎన్టీఆర్-కథానాయకుడు విడుదలైన తర్వాత ఈ సినిమాపై తేజ అభిప్రాయం తెలుసుకోవాలని మీడియా వారు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు.తన తాజా చిత్రం ‘సీత ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా తేజ మీడియా ప్రతినిధులకు ఎదురు పడ్డారు.బిజీగా ఉండటం వల్ల తాను ఎన్టీఆర్-కథానాయకుడు సినిమా ఇంకా చూడలేదని, ఒక వేళ చూసి ఉంటే మాట్లాడేవాన్ని అంటూ.

తెలివిగా అందరి నోటికి తాళం వేశారు.

మెరిసే చర్మం కోసం అరటిపండు పేస్ పాక్స్
Advertisement

తాజా వార్తలు