సుకుమార్ శిష్యులకి ఎంత ఇష్టమంటే..?

టాలీవుడ్ లో చాలా ఎక్స్పెరిమెంటల్ సినిమాలు తీసి సినిమా హిట్ ప్లాప్ తో సంబందం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో ఒక శిఖరం ల ఎదిగారు సుకుమార్.

( Sukumar ) ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తు పొందిన సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

ఇది కూడా హిట్ అయితే సుకుమార్ పేరు పాన్ ఇండియా స్థాయిలో మరోసారి మారుమ్రోగిపోతుంది.ఇక ఇండస్ట్రీ లో సుకుమార్ ఒక్కడే కాదు ఆయన శిష్యులు కూడా సక్సెస్ఫుల్ డైరెక్టర్లుగా గుర్తింపు పొందుతున్నారు.

వాళ్లలో బుచ్చిబాబు సానా, పల్నాటి సూర్య ప్రతాప్,శ్రీకాంత్ ఓదెల, కార్తీక్ దండు లాంటి వారు ఉన్నారు.కుమారి 21ఎఫ్ సినిమాతో సక్సెస్ అందుకున్న సూర్య ప్రతాప్( Surya Prathap ) సుకుమార్ గురించి మాట్లాడారు.

ఆర్య నుంచి నేనొక్కడినే సినిమా వరకు అన్నయ్య తో పని చేశా.ఆయన ఆలోచన విధానానికి మంత్ర ముగ్ధులు అవుతాం.

Advertisement

ఆయన నుంచి నేర్చుకోవడానికి బానిసలైపోతాం.ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది.

నాకు ఆయన ఐదు కథలిచ్చారు.అందులో కొన్ని తిరిగి ఇవ్వమని అడిగారు.

కానీ ఇవ్వనని చెప్పా.ఇద్దరి మధ్య అలాంటి స్నేహం ఉంది’ అని అన్నారు.

ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు( Director Buchibabu ) మొదట సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?

100% లవ్ సినిమా నుంచి రంగస్థలం వరకు పని చేశా.ఏ ఫిల్మ్ స్కూల్ ఇవ్వని అనుభవం, విజ్ఞానం ఆయన అందించారు.ఏదైనా నిర్మొహమాటంగా అడగొచ్చు.

Advertisement

అలాగే ‘దసరా’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) ఆయన స్కూల్ నుంచి వచ్చిన వారే.సర్ దగ్గర చాలా మంది అసిస్టెంట్లు ఉంటారు.

అందరిని సమానంగా చూస్తారు.ఇప్పటికీ ఆయన కథ రాయాలంటే వంద రకాలుగా ఆలోచిస్తారు.

ప్రతి సన్నివేశాన్ని భాధ్యత, భయంతో చేస్తారు.ఇటీవల విడుదలైన విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కార్తీక్ దండు( Karthik Dandu ) మాట్లాడుతూ విరూపాక్ష కంటే ముందే కథ చెప్పా.అది నచ్చలేదు.

విరూపాక్ష కథ నచ్చడంతో నేను పని చేస్తా నిర్మాతగా ఉంటా అని అన్నారు.ఆయన నుంచి చాలా నేర్చుకున్న అందువల్ల నా ఆలోచన స్థాయి పెరిగింది అంటూ చెప్పుకొచ్చారు.

ఆయన శిష్యులకి సుకుమార్ అంటే చాలా ఇష్టం.అందుకే సుకుమార్ గురించి చెప్పడానికి వాళ్ళు చాలా ఉత్సాహాన్ని చూపిస్తు చాలా ఎంజాయ్ చేస్తూ ఆయన గురించి మాట్లాడుతారు.

తాజా వార్తలు