గేమ్ ఛేంజర్ సినిమాపై శంకర్ సంచలన వ్యాఖ్యలు... సంతృప్తిగా లేదంటూ?

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శంకర్( Shankar ) ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) హీరోగా గేమ్ ఛేంజర్( Game Changer ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా జనవరి 10వ తేదీ విడుదల అయింది.

అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.ఇక ఈ సినిమా కోసం నిర్మాత దిల్ రాజు( Dil Raju ) ఈ స్థాయిలో డబ్బు ఖర్చు చేసినప్పటికీ ఈ సినిమా మాత్రం అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Director Shankar Sensational Comments On Game Changer Movie ,game Changer, Ram

ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా శంకర్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.ఈ సినిమా గురించి వస్తున్న నెగిటివ్ రివ్యూస్ పట్ల మీ స్పందన ఏంటి అనే ప్రశ్న ఎదురయింది.ఈ ప్రశ్నకు శంకర్ సమాధానం చెబుతూ ఇప్పటివరకు నా వరకు ఎలాంటి నెగటివ్ రివ్యూస్ రాలేదని కేవలం పాజిటివ్ రివ్యూస్ మాత్రమే వచ్చాయని తెలిపారు.

వాస్తవానికి ఈ సినిమా ఫైనల్ ఔట్పుట్ నాకు సంతృప్తి ని ఇవ్వలేదనీ శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Director Shankar Sensational Comments On Game Changer Movie ,game Changer, Ram
Advertisement
Director Shankar Sensational Comments On Game Changer Movie ,Game Changer, Ram

నాకు ప్రతీ సినిమాలోనూ డిటైలింగ్ ఇవ్వడం అలవాటు.ఈ సినిమాకి కూడా అదే చేశాను.5 గంటల ఫుటేజీ వచ్చింది.కనీసం మూడు గంటల ఫుటేజీ అయినా ఉండాలని దిల్ రాజు గారితో చెప్పాను .ఆయన మాత్రం మా తెలుగు వారు అంత నిడివి ఉన్న చూడటానికి ఇష్టపడరని చెప్పడంతో ఈ సినిమాని పూర్తిగా తగ్గించామని తెలిపారు.ఇక ఈ సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ సుమారు ఒక గంట పాటు ఉంది.

దిల్ రాజు చెప్పిన ప్రకారమే ఈ సినిమాని అరగంట పాటు తగ్గించామని శంకర్ తెలియజేశారు.ఇకపోతే ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో చరణ్ నటన ఎంతో అద్భుతంగా ఉంది.

ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని మరో 20 నిమిషాలు పెంచి ఉండుంటే సినిమా ఫలితం వేరే లెవెల్లో ఉండేది.రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు కూడా వచ్చేదనీ , కేవలం దిల్ రాజు గారి వల్ల ఈ సినిమా అనుకున్న స్థాయిలో కలెక్షన్లను రాబట్ట లేకపోయిందని చెప్పాలి.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!
Advertisement

తాజా వార్తలు