టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాష్ అండ్ డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పూరి జగన్నాథ్ ( Puri Jagannadh ) తన పూరి మ్యూజింగ్స్ ద్వారా ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
అయితే తాజాగా ఈయన ప్రేమ ( Love ) కంటే కుటుంబానికి ( Family ) ఎక్కువ విలువ ఇవ్వాలి అంటూ తన మ్యూజింగ్స్ ద్వారా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ప్రేమలో పడుతూ ఉంటారు.అయితే ప్రేమలో పడినటువంటి ఆ జంట పెళ్లి చేసుకుంటే పర్లేదు కానీ ఒకవేళ వారి ప్రేమ విఫలం( Love Failure ) అయితే ఏకంగా సూసైడ్లు చేసుకుంటూ ఉంటారు.
ఇలాంటివారిని ఉద్దేశిస్తూ పూరి జగన్నాథ్ మాట్లాడారు మన ఈ ప్రపంచంలో మన అమ్మకంటే మనల్ని ఎవరూ ఎక్కువగా ప్రేమించరు అలాంటి అమ్మ కోసం ఎప్పుడైనా ఏడ్చారా? వారికోసం కత్తి తీసుకొని చేయి కోసుకున్నారా? అమ్మ కోసం ఇలాంటివి చేయరు కానీ ఒక అమ్మాయి కోసం మాత్రం ఇలాంటివన్నీ చేస్తుంటారు.ప్రేమ విఫలమైతే అన్నం తినరు.కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు.
అయితే ఈ ప్రేమలన్నీ కేవలం శృంగారం కోసం మాత్రమేనని పూరి జగన్నాథ్ వెల్లడించారు.
నీది నిజమైన ప్రేమే అయితే అందమైన అమ్మాయిలను ఎందుకు ప్రేమిస్తున్నావు? కాళ్లు చేతులు లేనటువంటి అమ్మాయిలను కూడా ప్రేమించవచ్చు కదా.నువ్వు నిజంగా ఒక అమ్మాయిని ప్రేమించావు అంటే తన నిర్ణయాలను కూడా గౌరవించమని ఈయన తెలిపారు.అలా కాకుండా అందం చూసి ప్రేమిస్తే తనని పెళ్లి చేసుకున్న రెండేళ్లలో తనపై నీకున్నటువంటి ప్రేమ తగ్గిపోతుంది.
నీ కోరికలన్నీ తీరిపోతాయి.కొత్త కోరికలు మొదలవుతాయి.
పెళ్లి తర్వాత ఆ అమ్మాయిని చూసే విధానం కూడా మారిపోతుంది.మన సైన్స్ ప్రకారం ఆడ మగ మధ్య కేవలం 18 నెలలు మాత్రమే అట్రాక్షన్ ఉంటుంది అంటూ ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy