టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ( Director Prashant Verma ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
కొత్త కొత్త కాన్సెప్ట్ లతో సినిమాలను తెరకెక్కిస్తూ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.
ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన సినిమాలు అన్నీ కూడా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటున్నాయి.ఇది ఇలా ఉంటే త్వరలోనే ప్రశాంత్ వర్మ హనుమాన్( Hanuman ) సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు.
సినిమా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా దాదాపు 11 భాషల్లో విడుదల కానుంది.ఇది ఇలా ఉంటే నేడు అనగానే 29 న ప్రశాంత్ వర్మ పుట్టినరోజు.
ఈ సందర్భంగా తాజాగా మీడియాతో ముచ్చటించిన ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.తన కలల ప్రాజెక్టు అయిన హనుమాన్ గురించి మరిన్ని విషయాలను వెల్లడించారు.
ప్రేక్షకులు అందరు హను-మాన్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.దీన్ని ఎప్పుడు విడుదల చేస్తారు? అని ప్రశ్నించగా ఆ విషయం పై స్పందించిన ప్రశాంత్ వర్మ.నేను కూడా ఎదురుచూస్తున్నాను.
సినిమా షూటింగ్ అంతా పూర్తయింది.ప్రస్తుతం వీఎఫ్‌ఎక్స్( VFX ) పనులు జరుగుతున్నాయి.
జూన్ చివరకు అవి పూర్తవుతాయి.జులైలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాము.
దీని టీజర్‌కు ఊహించని స్పందన వచ్చింది.
అందుకే అనుకున్నదాని కంటే మరికొంత మెరుగ్గా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము.ఆలస్యమైనా కూడా అద్భుతమైన అవుట్‌పుట్ వస్తుంది.ఒక్కో అంశాన్ని ఒక్కో కంపెనీ వాళ్లు వీఎఫ్‌ఎక్స్ చేస్తున్నారు అని చెప్పకొచ్చారు ప్రశాంత్ వర్మ.
కథ రాసుకున్నప్పుడే ఈ స్థాయిలో తీయాలనుకున్నారా? టీజర్ రెస్పాన్స్ చూశాక ఏమైనా మార్పులు చేశారా? అని ప్రశ్నించగా ఆ విషయం పై స్పందించిన ప్రశాంత్ వర్మ.అసలు అనుకోలేదు.
మేము ఈ సినిమా ప్రకటించిన దగ్గర తరువాత ఆడియన్స్ నుంచి వచ్చిన స్పందనను చూసి ఎప్పటికప్పుడు కథ స్థాయిని పెంచుతూ వెళ్లాము.సినిమా అంతా సిద్ధమయ్యాక ఏదో వెలితిగా అనిపించింది.
అప్పుడు ఒక పాత్రను యాడ్ చేశాం.ఆ తర్వాత చూస్తే ఆ పాత్ర వల్ల సినిమా 200 శాతం బాగుందనిపించింది.దానికి శ్రీనివాస మూర్తి( Srinivasa Murthy ) గారితో డబ్బింగ్ చెప్పించాలనుకున్నాము.
కానీ ఇప్పుడు ఆయన మన మధ్యలేరు.ఆయన వాయిస్‌ను ఎవరూ ఇమిటేట్ చేయలేకపోతున్నారు అని తెలిపారు.
మీ తర్వాత ప్రాజెక్ట్ బాలకృష్ణతో చేస్తున్నారట నిజమేనా? అని అడగగా.నెక్ట్స్ కాదు కానీ, మా ఇద్దరి కాంబినేషన్ లో త్వరలోనే ఒక సినిమా వస్తుంది.
ఇప్పటి వరకు చూడని బాలకృష్ణను అందులో చూస్తారు.హనుమాన్ తర్వాత అధీర చేయనున్నాను.
హను-మాన్ సినిమాకు అధీర సినిమాకు దగ్గరి సంబంధం ఉంటుంది.అధీర ఇంద్రుడి స్టోరీ.
నాకు స్క్రిప్ట్స్ విల్ అని ఒక కంపెనీ ఉంది.అందులో నాకు వచ్చిన ఐడియాలను రచయితలు డెవలప్ చేస్తుంటారు.
ప్రస్తుతం 10 స్క్రిప్ట్స్ మీద వర్క్ చేస్తున్నారు అని తెలిపారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy