Krishna Vamsi Mahesh Babu : మహేష్ బాబుతో మరో సినిమా కష్టమని చెప్పిన కృష్ణవంశీ.. అసలు సమస్య ఇదేనంటూ?

టాలీవుడ్ డైరెక్టర్ కృష్ణవంశీ( Director Krishna Vamsi ) అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా మురారి.

ఈ సినిమా విడుదల 23 ఏళ్లు అవుతున్న విషయం తెలిసిందే.

అయినప్పటికీ ఈ సినిమా గురించి ఈ సినిమాలోని పాటల గురించి ఇప్పటికే మాట్లాడుకుంటున్నారు.ముఖ్యంగా ఈ సినిమాలో పెళ్లి సాంగ్ ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు.

పలువురు అభిమానులు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆ మూవీని గుర్తుచేసుకుంటూ కృష్ణవంశీ ఖాతాను ట్యాగ్‌ చేస్తుంటారు.తీరిక చేసుకుని మరీ దర్శకుడు వారి పోస్ట్‌లపై స్పందిస్తుంటారు.

ఈ క్రమంలోనే మహేశ్‌ బాబు( Mahesh Babu )తో మరో సినిమా తీస్తే బాగుంటుందని కృష్ణవంశీకి ఓ అభిమాని విజ్ఞప్తి చేయగా కష్టమని చెప్పారు.ఈ మేరకు అభిమాని కోరికపై కృష్ణవంశీ స్పందిస్తూ.మీరు ఆణిముత్యాల్లాంటి సినిమాలు అందించగల సత్తా ఉన్నవారు.

Advertisement

మా అభిమాన నటుడు మహేశ్‌ బాబుతో ఒక కుటుంబ కథా చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నించండి అని సదరు అభిమాని కోరారు.మహేశ్‌ బాబు ఇంటర్నేషనల్‌ స్టార్‌( International Sstar ) కాబోతున్నారు.

అందుకే ఇప్పుడు ఆయనతో సినిమా చేయడం కష్టమండీ.అని కృష్ణవంశీ రిప్లై ఇచ్చారు.

మరో అభిమాని నిన్నే పెళ్లాడతా సినిమా సీక్వెల్‌ను నాగ చైతన్య( Naga Chaitanya )తో తీస్తే చూడాలనుందని మనసులో మాట బయటపెట్టగా.సీక్వెల్‌ చేయలేనని దర్శకుడు బదులిచ్చారు.ఎన్టీఆర్‌ హీరోగా గతంలో తాను తెరకెక్కించిన రాఖీ లాంటి సినిమాని ప్రస్తుతం ప్లాన్‌ చేస్తున్నానని, త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా కృష్ణవంశీ చేసిన కామెంట్స్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

Lorem Ipsum Dolor Sit Amet
Advertisement

తాజా వార్తలు