డైరెక్టర్ క్రిష్.. రూటు మార్చి మ్యాజిక్ చేస్తాడా?

క్రిష్ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ దర్శకులలో ఒకరు.అంతే కాదు వైవిధ్యమైన సినిమాలకు ఆయన కేరాఫ్ అడ్రస్.

అందరిలా కాకుండా కాస్త కొత్తగా సినిమాలు తీయాలని ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.అందుకే క్రిష్ ఏదైనా సినిమా తెరకేక్కిస్తున్నాడు అంటే చాలు ఒక ప్రత్యేకమైన క్రేజ్.

అంతా బాగానే ఉంటుంది కానీ కొన్ని కొన్ని సార్లు క్రిష్ వైవిధ్యంగా తెరకెక్కించడంలో తేడా కొట్టేస్తూ ఉంటుంది.దీంతో ప్రేక్షకుల ఆదరణ కరువై సినిమాలు ఫ్లాప్ గా నే మిగిలిపోతూ ఉంటాయి.

ఇలాగే బాలకృష్ణతో గౌతమీపుత్ర శాతకర్ణి అనే సినిమా తీశాడు క్రిష్.భారీ అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Advertisement
Director Krish Problems In Tollywood , Director Krish , Tollywood, Vedam, Kanche

కానీ ఆశించిన ఫలితాన్ని మాత్రం రాబట్టలేకపోయింది.అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా ప్లాన్ చేసాడు క్రిష్.

ఇది కూడా పిరియాడికల్ డ్రామా గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన అప్డేట్లు ప్రేక్షకులందరూ అంచనాలు పెంచేశాయి.

మరి దర్శకుడు క్రిష్ పవన్ కళ్యాణ్ అభిమానుల అంచనాలను చేరుకుంటాడా లేదా అన్నది ప్రస్తుతం ఉన్న ప్రశ్న.గౌతమీపుత్ర శాతకర్ణి తరువాత క్రిష్ కు ఒక హిట్ సినిమా కూడా లేదు.

అదే సమయంలో ఇప్పటి వరకు మెగా కాంపౌండ్ ముగ్గురు హీరోలతో మూడు సినిమాలు తెరకెక్కించాడు క్రిష్.అల్లు అర్జున్తో వేదం, వరుణ్ తేజ్ తో కంచె, వైష్ణవ్ తేజ్ తో కొండపొలం రూపొందించాడు.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

ఈ సినిమాలోని విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.

Director Krish Problems In Tollywood , Director Krish , Tollywood, Vedam, Kanche
Advertisement

సినిమాలోని హీరో ల నటన కూడా అద్భుతం అంటూ అందరూ పొగడ్తల వర్షం కురిపించారు.కానీ కమర్షియల్గా మాత్రం హిట్ కొట్టలేకపోయాయ్ ఈ సినిమాలు.దీంతో ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో తీస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో అయినా క్రిష్ రూటు మార్చి సరికొత్తగా తెరకేక్కిస్తాడా లేదా అన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ.

అదే సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానులను అంచనాలను అందుకోవడం అంటే మామూలు విషయం కూడా కాదు.దీంతో దర్శకుడు క్రిష్ భుజాలపై ఎక్కువగానే బాధ్యతలు ఉన్నాయని చెప్పాలి.

కాగా హరిహర వీరమల్లు తో క్రిష్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో అన్నది చూడాలి.ఇకపోతే హరిహర వీరమల్లు లో పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోంది.

తాజా వార్తలు