Director Krish : హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ పార్టీ కేసు.. విచారణకు ప్రముఖ డైరెక్టర్

హైదరాబాద్ రాడిసన్ పబ్ లో( Radisson Pub ) డ్రగ్స్ పార్టీ కేసులో పోలీసులు విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది.

ఇందులో భాగంగా ఇవాళ ప్రముఖ డైరెక్టర్ క్రిష్( Director Krish ) విచారణకు హాజరుకాబోతున్నారని తెలుస్తోంది.

అయితే ఇప్పటికే క్రిష్ పేరును గచ్చిబౌలి పోలీసులు( Gachibowli Police ) ఎఫ్ఐఆర్ లో చేర్చారు.ఈ క్రమంలోనే క్రిష్ డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది పోలీసులు విచారణలో తేల్చనున్నారు.

విచారణలో భాగంగానే క్రిష్ కు వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

డ్రగ్స్ కేసులో( Drugs Case ) విచారణకు సహకరించాలని పోలీసులు కోరగా.క్రిష్ విచారణకు హాజరు అవుతానని చెప్పారు.కాగా ఇప్పటివరకు కేసులో నలుగురు అరెస్ట్ కాగా చరణ్, సందీప్ నీల్, నటి లిషి, శ్వేత కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement

మరోవైపు సీసీ కెమెరాల్లోని ఫుటేజ్ ను హోటల్ నిర్వాహకులు డిలీట్ చేశారని తెలుస్తోంది.దీంతో హోటల్ నిర్వాహకులపై కూడా గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 5, ఆదివారం 2023
Advertisement