టాలీవుడ్ ఇండస్ట్రీలో జాగర్లమూడి రాధాకృష్ణ( Krish Jagarlamudi ) అలియాస్ క్రిష్ తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు.
ఈ డైరెక్టర్ చాలా సెన్సిటివ్ టాపిక్స్ తీసుకుంటాడు.
వాటిని ఒక హార్ట్ టచింగ్ దృశ్య కావ్యంగా మలచి ఆకట్టుకుంటారు.ఆయన సినిమాల్లోని డైలాగ్స్ మనసులను హత్తుకుంటాయి.
ఆయన తీసే ప్రతి సినిమా కూడా సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఆఫర్ చేస్తుంది.ఆయన మూవీలు జీవిత సత్యాలను తెలియజేస్తాయి.
ఉదాహరణకు ఈ డైరెక్టర్ తీసిన గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురం , కంచె వంటి సినిమాలో నిజ జీవితాలకు దగ్గరగా ఉంటాయో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.ఈ సినిమాలో చూసిన తర్వాత కలిగే అనుభూతి మాటల్లో వర్ణించలేం.
సోషల్ మెసేజ్ లు అందించే సినిమాలు మాత్రమే కాదు ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’, ‘హరి హర వీరమల్లు’ లాంటి పీరియడ్ డ్రామా సినిమాలను కూడా తీయడంలో సిద్ధహస్తుడు డైరెక్టర్ క్రిష్.బాలకృష్ణ హీరోగా వచ్చిన "గౌతమీ పుత్ర శాతకర్ణి" మూవీ అమరావతి సాంస్కృతిక ప్రాముఖ్యత, సరిహద్దులు లేని సమాజం గురించి తెలియజేసింది ఈ మూవీ చాలా మందిని ఆకట్టుకుంది హైయ్యెస్ట్ రేటింగ్స్‌తో సూపర్ హిట్ అయింది.
క్రిష్ అప్‌కమింగ్ మూవీ ‘హరి హర వీరమల్లు( Hari Hara Veera Mallu )’ మరికొద్ది వారాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే డైరెక్టర్ క్రిష్ తాజాగా ‘నా ఉఛ్వాసం కవనం’ అనే ఈటీవీ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేశారు.ఇందులో ఆయన అనేక విశేషాలను వెల్లడించారు.
ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రితో తనకి మంచి అనుబంధం ఉందని కూడా వెల్లడించాడు.
క్రిష్ మాట్లాడుతూ ‘ఒక సినిమాకి మంచి కథ, స్క్రీన్ ప్లేతో ఉంటే సరిపోదు.ప్రేక్షకులకు నచ్చే మంచి సాంగ్స్ కూడా ఉండాలి.సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు ఉంటే ఏ సినిమా అయినా హిట్ అవుతుంది.
కథకి ఆయన పాటలు బలం చేకూరుస్తాయి.ఆయన రాసే పాటల్లోనే సినిమా స్టోరీ అంతా దాగి ఉంటుంది.
సీతారామశాస్త్రి నేను తీసిన ‘గమ్యం’ సినిమా( Gamyam Movie )లో ‘ఎంతవరకు.ఎందుకొరకు’ పాటలోనే ఆ మూవీ సారాంశం ఏంటో చాలా చక్కగా చెప్పగలిగారు.
సీతారామశాస్త్రి రాసిన ఆ పాట సాహిత్యానికి మ్యాచ్ చేస్తూ సాంగ్ షూటింగ్ చేయడం నాకు పెద్ద టాస్క్ అయిపోయింది.మారింది.
ఆయన రాసే పాటలు అంత గొప్పగా ఉంటాయి." అని చెప్పుకొచ్చాడు.సీతారామశాస్త్రి సింగిల్ సాంగ్‌కు రూ.2 లక్షల రెమ్యూనరేషన్ తీసుకునేవారని కూడా ఈ దర్శకుడు వెల్లడించాడు.అప్పట్లో అంత బడ్జెట్ లేక కేవలం ఒక్క పాట ఆయనతో రాయించుకోవాలని క్రిష్ అనుకున్నాడట, మిగిలిన సాంగ్స్ వేరే రచయితలతో రాయించుకోవాలని భావించాడట.
క్రిష్ మాట్లాడుతూ "సీతారామశాస్త్రి ఒక్క పాట రాయాలన్నా స్టోరీ మొత్తం చెప్పమంటారు.ఎందుకంటే ఆ స్టోరీ పై అవగాహన ఉంటేనే ఆయన తనకు ఇచ్చిన గొప్పగా రాయగలుగుతారు.
నా గమ్యం మూవీ స్టోరీ వినిపించాలని అడిగినప్పుడు నేను ఎలాంటి అభ్యంతరం లేకుండా స్టోరీ మొత్తం చెప్పేసా.గమ్యం సినిమా కథ వినగానే, మొత్తం ఆరు పాటలు తానే రాస్తానని అనడంతో నేను ఆశ్చర్యపోయా" అని క్రిష్ తెలిపాడు.
ఆ తర్వాత ఆయన సీతారామశాస్త్రితో మాట్లాడుతూ "సార్, మీరు ఒక్కో పాటకు రూ.2 లక్షలు తీసుకుంటారని తెలుసు.మొత్తం 6 పాటలకు రూ.12 లక్షలు ఇచ్చేంత బడ్జెట్ మా నిర్మాత వద్ద లేదు.మాకు నిర్మాత కేవలం రూ.2 కోట్ల బడ్జెట్ మాత్రమే ఇచ్చారు." అని చెప్పాడట.
దానికి సదరు లిరిసిస్ట్ బదులిస్తూ "నాకు ఒక్క పైసా కూడా ఇవ్వొద్దు.సాంగ్స్ రాస్తాను, సినిమా రిలీజ్ అయ్యాక నీకు ఎంత ఇవ్వాలని అనిపిస్తే అంత ఇవ్వు, నేనేమీ డబ్బుల కోసం నిన్ను హింసించను’ అని అన్నారట.
దాని గురించి గుర్తు చేసుకుంటూ క్రిష్ ఎమోషనల్ అయ్యాడు.‘గమ్యం’ మూవీ పెద్ద హిట్ అవ్వడానికి కథ, స్క్రీన్ ప్లే 50% కారణమైతే శాస్త్రి సాహిత్యం మరో 50% కారణమైందని క్రిష్ తెలిపారు.
"ఈ సినిమా ఫ్లాప్ అయి ఉంటే నేను అప్పుడే విదేశాలకు వెళ్లి జాబ్ చేసుకునే వాడిని, సినిమాలను పూర్తిగా మానేసేవాడిని." అని డైరెక్టర్ క్రిష్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy