తెలుగులో కమర్షియల్ డైరెక్టర్స్ అనగానే గుర్తుకు వచ్చే పేరు వి వి వినాయక్. ఒకప్పుడు ఈయన చేసిన సినిమాలు చాలా పెద్ద విజయాలను అందుకున్నాయి.
తెలుగు లో చాలా రోజుల పాటు టాప్ డైరెక్టర్ గా కొనసాగాడు అయితే తెలుగులో వినాయక్ లాగే తమిళంలో కూడా ఒక కమర్షియల్ డైరెక్టర్ ఉన్నాడు ఆయనే హరి.( Director Hari ) ఆయన చేసిన సినిమాల్లో తెలుగు లో చాలా సినిమాలే రిలీజ్ అయ్యాయి మొదటగా సూర్య హీరోగా వచ్చిన ఆరు సినిమా( Aaru movie ) మంచి విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా తరువాత మళ్లీ సూర్య హీరోగా వచ్చిన యముడు( Yamudu ) సినిమా అయితే సూపర్ హిట్ అయింది తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాని విపరీతంగా ఆదరించారు అనే చెప్పాలి.
ఇక ఈ సినిమా తరువాత యముడు కి సీక్వల్ గా వచ్చిన సింగం సినిమా( Singam ) కూడా మంచి విజయం అందుకుంది.తెలుగు లో హరి కి చాలా మంది అభిమానులు ఉన్నారు ఆయన సినిమాలు అంటే ఇక్కడ ప్రేక్షకులు చాలా ఇష్టపడుతారు ఎందుకంటే ఆయన సినిమాలు మన తెలుగు డైరెక్టర్స్ తీసినట్టుగానే ఉంటాయి కాబట్టి మన తెలుగు ప్రేక్షకులకి కూడా ఆయన సినిమాలు తొందరగా కనెక్ట్ అయ్యాయనే చెప్పాలి.
ఇక ఆయన ఇప్పడూ డైరెక్ట్ గా తెలుగు హీరో తోనే ఒక సినిమా చేసే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.ఇంతకు ముందు చాలా సార్లు ఆయన తెలుగు లో ఒక స్ట్రెయిట్ సినిమా చేయాలి అనుకున్నప్పటికీ అది ఇప్పటి వరకు సాధ్యపడలేదు.ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన ఒక తెలుగు టాప్ హీరో తో కథ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy