రాజమౌళి భార్య దగ్గర అప్పు చేసిన స్టార్ డైరెక్టర్.. ఆ అప్పు ఇప్పటికీ తీర్చలేదా?

తెలుగు సినీ ప్రేక్షకులకు డైరెక్టర్ హను రాఘవపూడి ( Director Hanu Raghavapudi )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

సీతారామం సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన ఈ సినిమాతో ప్రతి ఒక్కరూ తన గురించి మాట్లాడుకునేలా చేశారు.

ఇకపోతే కెరియర్ బిగినింగ్ లో అనురాగ గుడికి దర్శకుడు రాజమౌళి మద్దతుగా నిలవడంతో పాటు ఆయన సపోర్ట్ గా నిలిచిన విషయం తెలిసిందే.ఆ తర్వాత కృష్ణగాడి వీర ప్రేమగాధ చిత్రంతో( Krishnagadi Veera Premagadha movie ) హను తొలి హిట్ అందుకున్నారు.

ఆ తర్వాత కొన్ని ఫ్లాపులు పడ్డాయి.సీతారామం చిత్రంతో మళ్ళీ పుంజుకున్నారు.

ఇప్పుడు హను కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

Advertisement

ఇకపోతే ఈయన త్వరలోనే ప్రభాస్ తో ఒక భారీ ప్రాజెక్టు చేయబోతున్న విషయం తెలిసిందే.దాదాపుగా 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ సోల్జర్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.

ఇటీవలే ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టిన విషయం తెలిసిందే.ఆ సంగతి పక్కన పెడితే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా హను రాఘవపూడి ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ తన ఆర్థిక ఇబ్బందుల గురించి, తన కెరియర్ లో ఎదురైన సమస్యల గురించి తెలిపారు.

కాగా హను రాజమౌళి సతీమణి రమా రాజమౌళి ( Rama Rajamouli )దగ్గర లక్ష రూపాయలు అప్పు చేశారట.కానీ ఆ అప్పును ఇంతవరకు చెల్లించలేదని హను సరదాగా తెలిపారు.

అయితే ఎందుకు తిరిగి ఇవ్వలేదు అని యాంకర్ ప్రశ్నించగా.కొన్ని రుణాలు ఆలాగే ఉంచుకుంటే బావుంటుంది అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు.ఆ అప్పు ఎప్పటికీ చెల్లించనని తెలిపారు హను రాఘవపూడి.

"దేవర"ని రిజెక్ట్ చేసి పెద్ద గండం నుంచి తప్పించుకున్న స్టార్ హీరోయిన్..?
లైఫ్ లో ఎవరినీ నమ్మొద్దు.. వైరల్ అవుతున్న బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు!

ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, ఆయనకు కలిసి వచ్చినట్టు ఉంది అందుకే ఎప్పటికీ తీర్చనని చెబుతున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Advertisement

తాజా వార్తలు