ఆ సినిమా చేసేందుకు సౌత్ హీరోలు ముందుకు రాలేదు.. గౌతమ్ మీనన్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్, కోలీవుడ్ (Tollywood, Kollywood)ఇండస్ట్రీలలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న డైరెక్టర్లలో గౌతమ్ మీనన్ (director gautam menon )ఒకరు.

ఈ మధ్య కాలంలో ఈ డైరెక్టర్ పరిమితంగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు.

మరోవైపు గౌతమ్ మీనన్ సినిమాల్లో నటుడిగా కెరీర్ ను కొనసాగిస్తూ సత్తా చాటుతున్నారు.గౌతమ్ మీనన్ తన కెరీర్ లో ఎక్కువగా రొమాంటిక్ సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే.

గౌతమ్ మీనన్ మాట్లాడుతూ రొమాంటిక్ సినిమాలు తెరకెక్కించాలని ఉందని కానీ సౌత్ లో ఏ హీరో కూడా అందుకు ఒప్పుకోవడం లేదని గౌతమ్ మీనన్ వెల్లడించారు. బెంగళూరు(Bangalore) అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి బుధవారం రోజున గౌతమ్ మీనన్ హాజరయ్యారు.

ఈ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ ఏ హీరో కూడా రొమాంటిక్ సినిమాలు చేయడం లేదని చెప్పుకొచ్చారు.తెలుగుతో పాటు తమిళ, కన్నడ(Telugu, Tamil and Kannada) హీరోలను సైతం తాను సంప్రదించానని చెప్పుకొచ్చారు.

Advertisement

రొమాంటిక్ కథ ఉందని చెప్పగానే హీరోలు మీటింగ్ వాయిదా వేస్తున్నారని గౌతమ్ మీనన్ పేర్కొన్నారు.అది ఎందుకనేది మీరే వారిని అడగండి అని ఆయన వెల్లడించారు.

అయితే నా దగ్గర కథలకు కొదవలేదు.అందుకే ఇంకా సినిమాల్లో కొనసాగుతున్నానని ఆయన తెలిపారు.

కాకా ఖాఖా సినిమా(Kaka Khakha movie) రిలీజైన మొదట్లో ఎవరూ ఇష్టపడలేదని ఆ సినిమా అందరికీ నచ్చిందని గౌతమ్ మీనన్ పేర్కొన్నారు.ఓటీటీలకు జనాలు అతుక్కుంటున్న నేపథ్యంలో థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడం ఛాలెంజ్ అని ఆయన అభిప్రాయపడ్డారు.సినిమా రివ్యూలలో పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారని గౌతమ్ మీనన్ తెలిపారు.

గౌతమ్ మీనన్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.గౌతమ్ మీనన్ సరిగ్గా ప్రయత్నిస్తే ఆయనకు హీరోలు దొరకడం కష్టం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు