Chandra Mahesh: డైరెక్టర్‌ మీద అభిమానంతో కోట్లు పోగొట్టుకున్నాడు.. చివరికి ఇప్పుడిలా

కొంతమందిపై ఉన్న అభిమానంతో మనం వారి కోసం ఏ పనులైనా చేస్తూ ఉంటాం.వారికోసం డబ్బులు ఖర్చు పెట్టడం లాంటివి చేస్తూ ఉంటాం.

ఇలా ఒకరి మీద అభిమానంతో డబ్బులు ఖర్చు పెట్టి ఆర్ధికంగా నష్టపోయినవారు చాలామంది ఉంటారు.సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి బాధితులు ఎక్కువమంది ఉంటారు.

డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్ల మీద ఉన్న అభిమానంతో వారితో సినిమాలు తీస్తారు.నిర్మాతగా మారి వారి సినిమాల కోసం రూ.కోట్లల్లో డబ్బులు పెట్టుబడి పెడతారు.కానీ ఆ తర్వాత పెట్టిన డబ్బులు తిరిగి రాకపోతే అప్పుల పాలవుతారు.

సినీ దర్శకుడు చంద్ర మహేశ్( Chandra Mahesh ) కూడా అలాంటి అనుభవాలను ఎదుర్కొన్నాడు.

Advertisement

ప్రేయసి రావే, విజయరామరాజు, హనమంతు వంటి సినిమాలను చంద్ర మహేశ్ తెరకెక్కించాడు.అయితే అతడికి తమిళ డైరెక్టర్ భాగ్యరాజా( Director Bhagyaraja ) అంటే విపరీతమైన అభిమానం.ఆయన మీద అభిమానంతో భాగ్యరాజా కథతో ఒక సినిమా చేయాలని చంద్ర మహేశ్ అనుకున్నాడు.

ఈ విషయాన్ని భాగ్యరాజాకు చెప్పగానే ఆయన కూడా సహకరించారు.దీంతో భాగ్యరాజా కుమారుడిని తెలుగులో పరిచయం చేస్తూ సినిమా తీయగా.

దానికి చంద్ర మహేశ్ నిర్మాతగా కూడా వ్యవహరించి నష్టపోయాడు.దాదాపు రూ.3 కోట్లు నష్టపోయినట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో చంద్ర మహేశ్ చెప్పుకొచ్చాడు.ఇంట్లో ఉన్న వస్తువులతో పాటు ఫిల్మ్ నగర్‌లోని ఇంటికి తక్కువ రేటుకు అమ్ముకున్నట్లు తెలిపాడు.

అప్పులకు తెచ్చిన డబ్బులకు వడ్డీలు ఎక్కువైపోవడంతో చివరికి అద్దె ఇంట్లోకి కూడా వచ్చినట్లు చంద్ర మహేష్ చెప్పాడు.భాగ్యరాజాపై తనకు ఉన్న అభిమానమే కొంప ముంచిందని బాహాటంగా ఇంటర్వ్యూలో చెప్పేశాడు.ఆయన కుమారుడు షూటింగ్ మధ్యలో ఆపేసి చెన్నై( Chennai ) వెళ్లిపోయేవాడని, ఇది చూసి హీరోయిన్ కూడా షూటింగ్ లో ఉందేది కాదన్నాడు.

అల్లంతో అధిక హెయిర్ ఫాల్ పరార్.. ఎలా వాడాలంటే?
అక్కడ నాని మూవీ కేవలం 5 థియేటర్లలో రిలీజవుతోందా.. అసలేం జరిగిందంటే?

ఇక భాగ్యరాజా షూటింగ్ లోనే అప్పటికప్పుడు స్క్రిఫ్ట్, డైలాగ్స్ రాసేవారని, దీని వల్ల షూటింగ్ ఆలస్యం అయ్యేదన్నాడు.దీని వల్ల నటులు సెట్ లోనే ఖాళీగా ఉండేవారని, స్క్రిఫ్ట్ వచ్చేసరికి ఆలస్యం కావడం వల్ల తర్వాతి రోజు షూటింగ్ జరిగేదన్నాడు.

Advertisement

వీటి వల్ల 60 రోజుల్లో పూర్తి కావాల్సిన సూటింగ్ 24 నెలల్లో పూర్తయిందని, దీని వల్ల ఖర్చు పెరిగి ఆర్ధికంగా నష్టపోయినట్లు చెప్పాడు.

తాజా వార్తలు