బాబి కొల్లి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) హీరోగా నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్.
తాజాగా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ( Sitara Entertainments, Fortune Four Cinemas )పతాకాలపై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో డాకు మహారాజ్ సినిమాను నిర్మించారు.తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు.
డాకు మహారాజ్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది.
మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి విశేష స్పందనను సొంతం చేసుకున్న ఈ సినిమా భారీ వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది.కేవలం ఐదు రోజుల్లోనే రూ.114 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, బాలకృష్ణ కెరీర్ లోనే అతి పెద్ద విజయం దిశగా దూసుకుపోతోంది.ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ లో విజయోత్సవ సభను నిర్వహించిన చిత్ర బృందం, డాకు మహారాజ్ సినిమాకి( Daku Maharaj ) ఇంతటి విజయాన్ని అందించిన అభిమానులకు, ప్రేక్షకులను కృతజ్ఞతలు తెలిపింది.
ఈ క్రమంలో దర్శకుడు బాబీ కొల్లి మాట్లాడుతూ. బాలకృష్ణ ఫిల్మోగ్రఫీలో ( Balakrishnas filmography )గుర్తుండిపోయే సినిమాలలో ఒకటిగా నిలవాలనే ఉద్దేశంతో డాకు మహారాజ్ సినిమాను మొదలు పెట్టాము.
డిస్ట్రిబ్యూటర్లు అందరికీ మూడు రోజుల్లోనే డబ్బులు వచ్చేసి హ్యాపీగా ఉన్నారు.
ఒక దర్శకుడిగా ఇంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు.బ్లాక్ బస్టర్లు చాలా వస్తాయి.కానీ రెస్పెక్ట్ అరుదుగా వస్తుంది.
డాకు మహారాజ్ సినిమా చూసి ఎందరో నాకు మాస్టర్ పీస్ అని మెసేజ్ లు పెడుతున్నారు.బాలకృష్ణ ఫిల్మో గ్రఫీలో ఒక మాస్టర్ పీస్ సినిమా ఇవ్వడానికి కారణమైన మా టీం అందరికీ థాంక్యూ సో మచ్.నా రైటింగ్ టీం చక్రి, మోహన్ కృష్ణ గారు, వినీత్, నందు, భాను ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు.బాలకృష్ణ గారికి బెస్ట్ ఫిల్మ్ ఇస్తానని వంశీ గారికి ముందే ప్రామిస్ చేశాను.
బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ లు తీయాలి, బెస్ట్ బాలకృష్ణ గారిని చూపించాలి అనుకున్నాను.దర్శకుడిని బాలకృష్ణ గారు ఎంతో నమ్ముతారు.పాత్రలో పరకాయప్రవేశం చేస్తారు.
జైపూర్ సింగల్ టేక్ లో బాలకృష్ణ గారు చేసిన నటన చూసి, అక్కడున్న 400 మంది చప్పట్లు కొడుతూనే ఉన్నారు.ఆయన కథను అర్థం చేసుకొని, దర్శకుడు ఏది అడిగితే అది చేస్తారు.
బాలకృష్ణ గారికి సినిమా గురించి, లైటింగ్ గురించి ఎంతో నాలెడ్జ్ ఉంటుంది. డీఓపీ విజయ్ కార్తీక్, ఫియట్ మాస్టర్ వెంకట్, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ ( DoP Vijay Karthik, Fiat Master Venkat, Art Director Avinash )గారు తమ బెస్ట్ ఇచ్చారు.
మా వెనకాల నిలబడి మమ్మల్ని బ్లెస్ చేసిన చినబాబు గారికి స్పెషల్ థాంక్స్.కథకు కీలకమైన నందిని పాత్రకు శ్రద్ధా శ్రీనాథ్ ప్రాణం పోశారు.
నిడివితో సంబంధం లేకుండా పాత్రను నమ్మి ఈ సినిమా చేసిన ప్రగ్యా జైస్వాల్ కి థాంక్యూ అని చెప్పుకొచ్చారు బాబి.ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy