జాను : ప్రభాస్‌కు థ్యాంక్స్‌ చెప్పిన దిల్‌రాజు

తమిళ హిట్‌ మూవీ 96ను తెలుగులో దిల్‌రాజు రీమేక్‌ చేశాడు.

జాను అనే టైటిల్‌తో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న దిల్‌రాజు తాజాగా మీడియా ముందుకు వచ్చాడు.

సినిమాకు సంబంధించిన పలు విషయాలను ఆయన మీడియాతో ముచ్చటించారు.పలువురు ఈ సినిమా రీమేక్‌ వద్దంటూ నాకు సలహా ఇచ్చారు.

Dill Raju Thanks To Prabhas 96-జాను : ప్రభాస్‌కు �

కాని నేను మాత్రం నమ్మకంతో ఈ చిత్రాన్ని చేయడం జరిగింది.ఇక ఈ సినిమా విడుదల సందర్బంగా ప్రభాస్‌ మరియు యూవీ టీం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నాడు.

యూవీ క్రియేషన్స్‌లో ప్రభాస్‌ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి జాన్‌ అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లుగా చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి.ఆ టైటిల్‌నే ఖరారు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

Advertisement

ఇలాంటి సమయంలో ఈ రీమేక్‌కు జాను అనే టైటిల్‌ను పెట్టేందుకు ప్రభాస్‌ మరియు యూవీ నిర్మాతలను దిల్‌ రాజు సంప్రదించగా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని, పెట్టుకోమంటూ సూచించారని దిల్‌రాజు అన్నాడు.మంచి మనసుతో వారు జాను టైటిల్‌ను ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నాడు.

వేగములు ఎన్ని, అవి ఏవి?
Advertisement

తాజా వార్తలు