అబ్బో దిల్‌రాజు పెద్ద ప్లాన్‌ వేశాడు.. ఇండియన్‌ సినీ చరిత్రలో సరికొత్త ప్రయోగం, ఇది సాధ్యం అయితే చరిత్రలో నిలిచి పోవడం ఖాయం

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రయోగాలకు దిల్‌ రాజు పెట్టింది పేరుగా వస్తున్నాడు.

ప్రస్తుతం వరుసగా మల్టీస్టారర్‌ చిత్రాలు వస్తున్నాయంటే కారణం అది దిల్‌రాజు నిర్మించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సూపర్‌ హిట్‌ అవ్వడమే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రతి సినిమాను కూడా కమర్షియల్‌గా చేస్తూ, ప్రతి సినిమాతో లాభాలను దక్కించుకుంటూ దూసుకు పోతున్న టాలీవుడ్‌ టాప్‌ నిర్మాత దిల్‌ రాజు.

ప్రస్తుతం దిల్‌రాజు భారీ అంచనాల నడుమ మహేష్‌బాబు మహర్షి చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.ఇక ఇటీవలే ఎఫ్‌2 చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.ఎఫ్‌ 2 చిత్రం బ్లాక్‌ బస్టర్‌ అయిన నేపథ్యంలో సీక్వెల్‌ గురించిన చర్చ జరుగుతుంది.

అనీల్‌ రావిపూడి సీక్వెల్‌ పై అప్పుడే ఒక స్టోరీ లైన్‌ను ఏర్పాటు చేశాడట.

Advertisement

అయితే ఆ స్టోరీలైన్‌ అత్యంత విభిన్నంగా ఉందట.ఎఫ్‌ 2 సినిమాకు కొనసాగింపుతో పాటు, రాజా ది గ్రేట్‌ చిత్రంకు కూడా కొనసాగింపుగా ఉంటుందట.అంటే ఎఫ్‌2 మరియు రాజా ది గ్రేట్‌ చిత్రాల కాన్సెప్ట్‌లను కలిపి ఎఫ్‌3 చిత్రంగా రూపొందించబోతున్నారట.

వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌లతో పాటు రవితేజ కూడా కనిపించబోతున్నాడనేది టాక్‌.రాజా ది గ్రేట్‌లో మాదిరిగానే రవితేజ అంధుడిగా కనిపించబోతున్నాడు.

భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించేందుకు దిల్‌రాజు ప్రయత్నాలు చేస్తున్నాడు.అంతా అనుకున్నట్లుగా సాగితే వచ్చే ఏడాదిలో ఈ ప్రతిష్టాత్మక సీక్వెల్‌ మల్టీస్టారర్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.ఇదే కనుక సక్సెస్‌ అయితే తెలుగు సినీ చరిత్రలో నిలిచి పోవడం ఖాయం.

'తులసి' వల్ల ఎన్నో ఉపయోగాలు.. తెలిస్తే ఆశ్చర్యపోతారు
Advertisement

తాజా వార్తలు