ప్లీజ్ ప్లీజ్ అంటూ స్టాలిన్ వెంట పడుతున్న దిల్‌ రాజు

తెలుగు లో టాప్ స్టార్ నిర్మాత గా వెలుగు వెలుగుతున్న దిల్ రాజు ఇప్పుడు హిందీ మరియు తమిళం లో కూడా సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

హిందీ లో నిర్మిస్తున్న సినిమా లు ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా పెద్ద విజయాన్ని సొంతం చేసుకోలేక పోయాయి.

అక్కడ ఇతర నిర్మాతలతో కలిసి చిన్న బడ్జెట్ సినిమాలు నిర్మించిన దిల్ రాజు తమిళం లో మాత్రం ఏకంగా 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో దిల్ రాజు సూపర్ స్టార్ విజయ్ తో వారసుడు సినిమా నిర్మించిన విషయం తెలిసిందే.తెలుగు తో పాటు తమిళం లో ఏక కాలం లో ఈ సినిమా ను రూపొందించారు.

తెలుగు లో పెద్ద గా బజ్ క్రియేట్ చేయలేక పోయారు.తమిళం లో ఆయన ఈ సినిమా ను భారీ ఎత్తున విడుదల చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలను దిల్ రాజు చేస్తున్నాడు.

అక్కడ దిల్ రాజు పెత్తనం నడవడం లేదట.థియేటర్ల విషయంలో పూర్తిగా ఉదయనిధి స్టాలిన్ కే చెల్లుతుందట.

Advertisement
Dil Raju Urging Udayanidhi Stalin About Theaters For Varasudu Movie Details, Dil

అందుకే అజిత్ సినిమా కంటే తన వారసుడు సినిమాకు ఎక్కువగా థియేటర్స్ ఇవ్వాలంటూ ఉదయనిది స్టాలిన్ వెంట దిల్ రాజు పడుతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది.

Dil Raju Urging Udayanidhi Stalin About Theaters For Varasudu Movie Details, Dil

దాదాపుగా 100 థియేటర్స్ ఎక్కువగా వారసుడు సినిమాకు ఇవ్వాల్సిందే అంటూ దిల్ రాజు విజ్ఞప్తి చేస్తున్న కూడా ఇద్దరు హీరోలకు సమానమైన ప్రాముఖ్యత దక్కే విధంగానే థియేటర్స్ కేటాయిస్తాం అన్నట్లుగా ఉదయ నిధి స్టాలిన్ పేర్కొన్నారు.ప్రస్తుతం మంత్రి హోదా లో ఉన్న ఉదయనిది స్టాలిన్ ని ప్రసన్నం చేసుకునేందుకు దిల్ రాజు తీవ్రం గా ప్రయత్నాలు చేస్తున్నాడు.మరి ముందు ముందు అయినా దిల్ రాజు కి ఎక్కువ థియేటర్లు ఇచ్చేందుకు ఉదయనిధి స్టాలిన్ ఓకే చెప్తాడా అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు