మెగా ప్రొడ్యూసర్‌ను ఫాలో అవుతున్న దిల్ రాజు

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెలుగు నిర్మాతలు తమకంటూ డిజిటల్ ప్లాట్‌ఫాంలను ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇటీవల ‘ఆహా’ అంటూ తన ఓటీటీ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

దీంతో తమ బ్యానర్‌లో రిలీజ్ అయ్యే సినిమాలు అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌లకు అమ్మే అవసరం లేకుండా తమ సొంత వేదికలపై రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది.కాగా అల్లు అరవింద్ బాటలోనే మరో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా పయనించాలని చూస్తున్నాడు.

ఇప్పటికే తన బ్యానర్‌లో తెరకెక్కుతున్న సినిమాలను ఆయన ఈ డిజిటల్ ప్లాట్‌ఫాంలో రిలీజ్ చేసేందుకు దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు.ఈ క్రమంలో అల్లు అరవింద్‌కు పోటీగా దిల్ రాజు తన సొంత ఓటీటీ ప్లాట్‌ఫాంను సిద్ధం చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఏదేమైనా సినిమా రంగంలో పోటీ పడేందుకు ఓటీటీ వేదికను ఈ ఇద్దరు స్టార్ ప్రొడ్యూసర్లు వినియోగించుకోనున్నారు.మరి ఈ ఇద్దరు నిర్మాతల్లో ఓటీటీలో ఎవరు సక్సెస్ సాధిస్తారో చూడాలి అంటున్నారు ప్రేక్షకులు.

Advertisement

కాగా దిల్ రాజు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న పింక్ రీమేక్ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

Cool Bet Im Überblick : Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten
Advertisement