వరుణ్‌ కూడా స్పీడ్‌ పెంచాడు.. తేజూలా తప్పు మాత్రం చేయడం లేదు

మెగా బ్రదర్‌ నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌ ‘ముకుంద’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.సినిమాల ఎంపిక విషయంలో ఈయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

నాగబాబు సలహాలు తీసుకుంటున్నాడో లేదా మరెవరైనా వరుణ్‌కు గైడెన్స్‌ ఇస్తున్నారో కాని వరుసగా మంచి చిత్రాలను ఈయన చేస్తున్నాడు.ఒకవేళ వరుణ్‌ చేసిన సినిమాలు ఫ్లాప్‌ అయినా కూడా ఏదో ఒక అంశంలో ప్రశంసలు దక్కించుకుంటూనే ఉంది.

చాలా స్లోగా సినిమాలు చేస్తాడు అంటూ ఇప్పటి వరకు వరుణ్‌ గురించి టాక్‌ ఉంది.కాని ప్రస్తుతం వరుణ్‌ జోరు చూసి అంతా అవాక్కవుతున్నారు.

వరుసగా మనోడు చిత్రాలు చేస్తూ అందరికి షాక్‌ ఇస్తున్నాడు.

Advertisement

ప్రస్తుతం సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో ఒక అంతరిక్ష నేపథ్యం కల్గిన సినిమాను చేస్తున్న వరుణ్‌ మరో వైపు దిల్‌రాజు బ్యానర్‌లో విక్టరీ వెంకటేష్‌తో కలిసి ‘ఎఫ్‌ 2’ అనే మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేస్తున్నాడు.ఈ రెండు సినిమాలు కూడా ప్రస్తుతం చకచక షూటింగ్‌ జరుపుకుంటున్నాయి.మల్టీస్టారర్‌ చిత్రాన్ని అనీల్‌ రావిపూడి పూర్తి స్థాయి మాస్‌ మసాలా యాక్షణ్‌ చిత్రంగా చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

మల్టీస్టారర్‌లో వరుణ్‌లోని మాస్‌ యాంగిల్‌ ఆవిష్కారం కాబోతుంది.ఈ సమయంలోనే వరుణ్‌ మరో సినిమాకు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది.

‘సినిమా చూపిస్త మావ’, ‘నేను లోకల్‌’ చిత్రాలతో దర్శకుడిగా యూత్‌ ఆడియన్స్‌ మనసును గెలుచుకున్న దర్శకుడు త్రినాధరావు నక్కిన ప్రస్తుతం దిల్‌రాజు బ్యానర్‌లో రామ్‌ హీరోగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.దసరాకు ముందు ఆ చిత్రాన్ని విడుదల చేసేందుకు దర్శకుడు త్రినాధరావు నక్కిన ఏర్పాట్లు చేస్తున్నాడు.

ఇక ఆ చిత్రం పూర్తి అవ్వడమే ఆలస్యం మెగా హీరో వరుణ్‌ తేజ్‌తో త్రినాధరావు సినిమాను చేయబోతున్నాడు.

మీ దంతాలు పసుపు రంగులో అసహ్యంగా కనిపిస్తున్నాయా? ఇలా చేస్తే ముత్యాల్లా మెరుస్తాయి!

మరో మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ కూడా వరుసగా చిత్రాలను చేస్తూ ఉన్నాడు.అయితే తేజూ కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోక పోవడంతో రెండు సంవత్సరాలుగా ఫ్లాప్‌ల మీద ఫ్లాప్‌లు పడుతూనే ఉన్నాయి.కాని వరుణ్‌ మాత్రం తన ప్రతి సినిమాకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

Advertisement

జాగ్రత్తగా ఉంటూనే సినిమాల సంఖ్య పెంచడంతో వరుణ్‌ విషయంలో మెగా ఫ్యాన్స్‌ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు