స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అంచనాలను తారుమారు చేస్తూ.. ఫ్లాప్ అయిన సినిమాలు ఇవే?

ఇటీవల కాలంలో ప్రేక్షకులు సినిమా నిర్మాణ సంస్థను బట్టి ఆ సినిమా హిట్ అవుతుందో లేదో అన్న విషయాన్ని కూడా అంచనా వేస్తున్నారు.

ఎందుకంటే సినిమా కథల ఎంపికలో నిర్మాణ సంస్థలు అంత ఖచ్చితత్వంతో ఉంటున్నాయి అని చెప్పాలి.

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న దిల్ రాజు ఏదైనా సినిమా నిర్మించేందుకు ఒప్పుకున్నారు అంటే చాలు ఆ సినిమాలో ఏదో కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతున్నారు.అంతేకాదు కథ బలంగా ఉంటుందని భావిస్తున్నారు.

దిల్ రాజు మీద నమ్మకంతోనే సినిమాలను చూస్తూ ఉంటారు.ఇప్పటివరకు దిల్ రాజు తన కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు.

అదే సమయంలో దిల్ రాజు అంచనాలను తారుమారు చేస్తూ ఒక్కసారిగా ప్లాపు గా నిలిచిన సినిమాలు కూడా ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి అని చెప్పాలి.అవేంటో తెలుసుకుందాం.

Advertisement

రౌడీ బాయ్స్ :

దిల్ రాజు తమ్ముడు శిరీష తనయుడు ఆశిష్ రెడ్డి హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రౌడీ బాయ్స్ సినిమా డిజాస్టర్ గా నిలిచిపోయింది.

లవర్ :

రాజ్ తరుణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేదు.నష్టాలను మిగిల్చింది.

ఇద్దరి లోకం ఒకటే :

మరోసారి రాజ్ తరుణ్ తోనే సినిమాలు చేసి దిల్ రాజు నష్టాలు చవి చూశాడు.ఇద్దరి లోకం ఒకటే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తే ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలిపోయింది.

ఓ మై ఫ్రెండ్ :

సిద్ధార్థ్ హీరో గా శృతి హాసన్ హీరోయిన్గా సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓ మై ఫ్రెండ్ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు.దీంతో ఈ సినిమా కూడా ఫ్లాప్ గానే మిగిలిపోయింది.

జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి

శ్రీనివాస కళ్యాణం :

నితిన్, రాశి కన్నా హీరో హీరోయిన్ లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీనివాస కళ్యాణం సినిమా ఫ్లాప్ గానే మిగిలిపోయింది ఎలా చెప్పాలి.

Advertisement

జోష్ :

నాగచైతన్య హీరోగా దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన జోష్ సినిమా కమర్షియల్ గా దిల్ రాజుకు మాత్రం నష్టాలనే మిగిల్చింది అని చెప్పాలి.

మరో చరిత్ర :

వరుణ్ సందేశ్ హీరోగా రొమాంటిక్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు.అయితే ఈ సినిమాలోని లవ్ స్టోరీ మాత్రం ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయింది.

కృష్ణాష్టమి :

సునీల్ హీరోగా వచ్చిన కృష్ణాష్టమి సినిమా విషయంలో కూడా దిల్రాజు అంచనా తప్పు అయింది.ఈ సినిమా ఫ్లాప్ గానే మిగిలింది.

మున్నా :

ప్రభాస్ హీరోగా అందాల ముద్దుగుమ్మ ఇలియానా హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మున్నా సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.ఇంకేముంది బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల మధ్య విడుదలైన చివరికి బోల్తా కొట్టింది.

తాజా వార్తలు