దిల్‌రాజు ఆ దర్శకుడిని బుట్టలో వేసుకున్నాడు

దిల్‌రాజు సినిమా నిర్మించాడు అంటే ఖచ్చితంగా అందులో మ్యాటర్‌ ఉంటుందని అంతా నమ్ముతారు.

సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు ఇలా అంతా కూడా దిల్‌రాజు సినిమా వస్తుందంటే నమ్మకం పెట్టుకుంటారు.

సక్సెస్‌ దర్శకులను, ట్యాలెంట్‌ ఉన్న దర్శకులను దిల్‌రాజు ఎప్పుడు వదులుకోడు అనే విషయం తెల్సిందే.తాజాగా మరోసారి దిల్‌రాజు తన తెలివిని ఉపయోగించాడు.

ఈమద్య తెలుగు సినిమా పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇంద్రగంటి మోహనకృష్ణ.ఈయన తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘సమ్మోహనం’.

సుధీర్‌బాబు హీరోగా అదితి రావు హీరోయిన్‌గా రూపొందిన ఆ చిత్రం కమర్షియల్‌ సక్సెస్‌ను దక్కించుకుంది.సుదీర్‌బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ సక్సెస్‌గా ఆ చిత్రం నిలిచింది.అందుకే ఆ దర్శకుడితో ఏకంగా చిరంజీవి మరియు మహేష్‌బాఋ కూడా సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.

Advertisement

ఆ విషయాన్ని స్వయంగా వారే దర్శకుడితో చెప్పుకొచ్చారు.దాంతో ఆ దర్శకుడిపై దిల్‌రాజు కన్ను వేశాడు.

ఇంద్రగంటి తర్వాత చిత్రాన్ని తాను నిర్మించాలని దిల్‌రాజు ఆశ పడుతున్నాడు.ఇప్పటికే ఒక స్క్రిప్ట్‌ను సిద్దం చేసుకుని హీరో కోసం ప్రయత్నాలు చేస్తున్న దర్శకుడు ఇంద్రగంటిని దిల్‌రాజు సంప్రదించడం జరిగింది.

ఇప్పటి వరకు చిన్న బ్యానర్‌లలో చేస్తూ వచ్చిన దర్శకుడు ఇంద్రగంటి తాజాగా దిల్‌రాజు సంప్రదించిన వెంటనే ఓకే చెప్పాడు.త్వరలోనే ఒక స్టార్‌ హీరో వద్దకు ఇంద్రగంటిని తీసుకుని దిల్‌రాజు వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది.

కథకు స్టార్‌ హీరో ఓకే చెబితే ఇంద్రగంటి కెరీర్‌లో బిగ్‌ చిత్రం చేయబోతున్నాడు.దిల్‌రాజు ప్రస్తుతం రెండు మూడు చిత్రాలను చేసే ఏర్పాట్లు చేస్తున్నాడు.

అరటిపండు తినండి .. ఈ రోగాలకు దూరంగా ఉండండి

మరో వైపు లవర్‌ చిత్రంను విడుదల చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు.ఇలా వరుసగా చిత్రాలతో బిజీగా ఉండే నిర్మాత దిల్‌రాజు ట్యాలెంట్‌ దర్శకుడు అయిన మోహనకృష్ణ ఇంద్రగంటితో సినిమా తీయబోతున్నాడు అనగానే అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

Advertisement

ఇక వీరిద్దరి కాంబోలో తెరకెక్కబోతున్న చిత్రంలో హీరో ఎవరా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది.వచ్చే నెల చివరి వరకు ఆ హీరో ఎవరు, సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందనే విషయాలను దిల్‌రాజు వెళ్లడి చేసే అవకాశం ఉంది.

సమ్మోహనం చిత్రంతో పలువురు హీరోలు ఇంద్రగంటి దర్శకత్వంలో సినిమాను చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.అందుకే దిల్‌రాజు, ఇంద్రగంటి ఒక స్టార్‌ హీరో కాంబో ఖచ్చితంగా వర్కౌట్‌ అవుతుందని అప్పుడే అంచనాలు వేస్తున్నారు.

తాజా వార్తలు