టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దిల్ రాజు( Dil Raju) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈయన నిర్మాతగా ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇక ఇటీవల దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్( Family Star ) అనే సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా దిల్ రాజు కూడా పలు కార్యక్రమాలకు హాజరవుతూ సందడి చేశారు.
ఈ క్రమంలోనే ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దిల్ రాజు తన రెండో పెళ్లి ( Second marriage ) గురించి కొన్ని విషయాలను వెల్లడించారు.దిల్ రాజు మొదటి భార్య అనిత( Anita ) అనారోగ్య సమస్యల కారణంగా మరణించిన సంగతి తెలిసిందే.ఇక ఈమె మరణించడంతో తన కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు ఈయన తేజస్విని అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నారు.
అయితే తనకు కూతురు ఉండి ఆమెకు పెళ్లి జరిగి పిల్లలు పుట్టిన తర్వాత ఈయన రెండో పెళ్లి చేసుకోవడంతో ఈయన పెళ్లి పట్ల ఎన్నో విమర్శలు( Trolls ) వచ్చాయి.
ఇలా రెండో పెళ్లి తర్వాత తమ గురించి వచ్చినటువంటి విమర్శలను చూసి తన భార్య తేజస్విని చాలా బాధపడింది అంటూ ఈ సందర్భంగా దిల్ రాజు వెల్లడించారు.ఇలా నా దగ్గరకు వచ్చి ఆ కామెంట్స్ గురించి చెప్పి బాధపడగా తనకు ఒకటే చెప్పాను. ఒక నిర్మాతగా ఒక కోటి మందికి నేను తెలిసి ఉంటాను కానీ ఆ కోటి మందిలో నెగిటివ్ కామెంట్లు పెట్టిన వాళ్ళు ఏ పదివేల మంది ఉంటారు.
ఆ పదివేల మంది గురించి ఆలోచిస్తూ బాధపడటం కన్నా మిగిలిన వారు మనల్ని తన ప్రేమని కామెంట్ చేయకుండా గౌరవిస్తున్న వారే కదా.కాబట్టి వీరందరూ ఇచ్చే గౌరవాన్ని పట్టించుకోకుండా, కేవలం ఆ పది వేల మంది కామెంట్స్ పట్టించుకోని బాధపడటం మూర్ఖత్వం అంటూ తాను ధైర్యం చెప్పానని ఈ సందర్భంగా దిల్ రాజు వెల్లడించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy