కాఫీలో ఇవి క‌లిపి తాగితే ఎన్ని హెల్త్ బెనిఫిట్సో.. తెలుసుకోండి!

కాఫీ. పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా చాలా మంది ఇష్టంగా తాగే పానియాల్లో ఇది ఒక‌టి.

కొంద‌రికైతే ఉద‌యం బెడ్ కాఫీ తాగందే రోజు కూడా గ‌డ‌వ‌దు.అంత‌లా కాఫీకి ఎడిక్ట్ అయి పోతుంటారు.

ప్ర‌త్యేక‌మైన రుచి, సువాసనను క‌లిగి ఉండే కాఫీని ప‌రిమితంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎలాంటి హానీ క‌ల‌గ‌దు.పైగా ఎన్నో లాభాలు సైతం క‌లుగుతాయి.

అందులోనూ కాఫీలో ఇప్పుడు చెప్ప‌బోయే ప‌దార్థాల‌ను క‌లిపి తాగితే అనేక హెల్త్ బెనిఫిట్స్‌ను పొందొచ్చు.మ‌రి లేటెందుకు అవేంటో చూసేయండి.

Advertisement

జాజికాయ ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుందన్న సంగ‌తి తెలిసిందే.అయితే కాఫీలో చిటికెడు జాజి కాయ పొడిని క‌లిపి తీసుకుంటే శ‌రీరంలో పేరుకు పోయిన కొవ్వంతా క‌రిగి పోయి వెయిట్ లాస్ అవుతారు .అదే స‌మ‌యంలో జాజికాయ పొడి క‌లిపిన‌ కాఫీని సేవిస్తే ఒత్తిడి, టెన్ష‌న్స్‌, ఆందోళన‌, త‌ల నొప్పి వంటి మానసిక స‌మ‌స్య‌ల‌న్నీ దూర‌మై మ‌న‌సు ప్ర‌శాంత‌గా మారుతుంది.అలాగే బ్లాక్ కాఫీలో నిమ్మ ర‌సం క‌లుపుకుని తీసుకోవ‌చ్చు.

ఇలా సేవించ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల ప‌డుతుంది.జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు చురుగ్గా మారుతుంది.

శ‌రీరంలోని వ్య‌ర్థాల‌న్నీ బ‌య‌ట‌కు పోతాయి.మ‌రియు మైండ్ కూడా రిలాక్స్ అయిపోతుంది.కాఫీలో దాల్చిన చెక్క పొడిని యాడ్ చేసి సేవించ‌డం వ‌ల్ల‌.

ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్ క‌రిగి పోతుంది.దాంతో గుండె పోటు, ఇత‌ర గుండె సంబంధిత జ‌బ్బులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

ఇక కాఫీలో డార్క్ చాక్లెట్ క‌లిపి కూడా సేవించ‌వ‌చ్చు.ఈ విధంగా తీసుకోవ‌డం వ‌ల్ల‌ నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌లు త‌గ్గి బాడీ యాక్టివ్‌గా మారుతుంది.

Advertisement

అదే స‌మ‌యంలో అధిక ఆక‌లి స‌మ‌స్య నుంచీ విముక్తి ల‌భిస్తుంది.

తాజా వార్తలు