వివాహాలు ఎన్ని రకాలో తెలుసా?

వివాహాలు ఎన్ని రకాలు అని అడిగితె ఎవరు సమాధానం వేంటనే చెప్పలేరు.ప్రాంతాన్ని బట్టి అక్కడి ఆచార వ్యవహారాలను బట్టి వివాహాలు భిన్నమైన రీతిలో జరుగుతూ ఉంటాయి.

అయితే ఏ వివాహం అయినా ఇప్పుడు చెప్పే 8 రకాల వివాహాల్లో ఎదో ఒక పద్దతి ప్రకారం జరుగుతుంది.వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.1.బ్రహ్మం - ఈ వివాహంలో వరుణ్ణి ఎంపిక చేసుకొని, తన కూతురుని వివాహం చేసుకోమని అడిగి చేసే వివాహం బ్రహ్మ వివాహం.2.దైవం - యజ్ఞ యాగాదులు చేసే రుత్విజునికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయటం దైవ వివాహం.3.అర్షం - ఒకప్పుడు గో సంపదను చూసి వివాహం చేసేవారు.అలాంటి రెండు గోవులను స్వీకరించి తన కుమార్తెకు వివాహం చేయటం అర్ష వివాహం.4.ప్రాజాపత్యం – ఇక నుంచి గృహస్థాశ్రమంలో ఉంటూ తనకు అందించిన కన్యను కంటికిరెప్పలా చూసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తూ వివాహం చేసుకోవడం ప్రాజాపత్య వివాహం.5.అసురం - తన కూతురిని ఇచ్చి వివాహం చేయటానికి వీలైనంత కన్యాశుల్కాన్ని తీసుకున్న తర్వాతే వివాహం చేయటాన్ని అసుర వివాహం అని అంటారు.6.గాంధర్వం - పెద్దవారి ప్రమేయం లేకుండా వధూవరులిద్దరూ పరస్పర అంగీకారంతో చేసుకుంటే ఆ వివాహాన్ని గాంధర్వ వివాహం అని అంటారు.7.రాక్షసం - తాను ఇష్టపడిన అమ్మాయిని బంధువుల అభిష్టానికి వ్యతిరేకంగా ఎత్తుకువెళ్లి చేసుకొనే వివాహాన్ని రాక్షస వివాహం అని అంటారు.8.పైశాచికం – నిద్రిస్తున్న స్త్రీ శీలాన్ని అపహరించి ఆపై ఆమెను పెళ్లి చేసుకోవటం పైశాచిక వివాహం అవుతుంది.

శొంఠి పొడి రెగ్యుల‌ర్‌గా తింటే..ఎన్ని బెనిఫిట్సో తెలుసా?
" autoplay>

తాజా వార్తలు