లాక్‌డౌన్‌ సడలింపులపై భిన్న వాదనలు

దేశ వ్యాప్తంగా నిన్నటి నుండి లాక్‌డౌన్‌ను సఢలిస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించిన విషయం తెల్సిందే.గ్రీన్‌ జోన్‌ మరియు ఆరెంజ్‌ జోన్‌లలో వేలాది వాహనాలు రోడ్లపైకి వచ్చాయి.

కార్యక్రమాలు మొదలు అయ్యాయి.రెడ్‌ జోన్‌లలో కూడా కాస్త జనాలు కనిపించారు.

Different Claims On Lockdown Easing Coronavirus,green Zone, Orange Zone, Red Zon

అయితే ఇదే సమయంలో నిన్న ఒక్క రోజే మూడు వేలకు పైగా కేసులు నమోదు అవ్వడం ఆందోళన కలిగిస్తున్న విషయం.వేలల్లో కేసులు నమోదు అవుతున్న ఈ సమయంలో లాక్‌డౌన్‌ను సఢలించడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

వలస కార్మికుల వేతనాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా వారి కోసం అంటూ లాక్‌డౌన్‌ను సడలించడం విడ్డూరంగా ఉందంటూ కాంగ్రెస్‌ నాయకత్వం అభిప్రాయం వ్యక్తం చేసింది.దేశ వ్యాప్తంగా కూడా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల చివరి వరకు అయినా కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

మొత్తానికి దేశంలో ఈ సఢలింపుల వల్ల కేసుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.లాక్‌ డౌన్‌ సఢలించడంతో సామాజిక దూరంకు జనాలు నీళ్లు వదిలేస్తున్నారు.

చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయా..? అయితే ఈ అలవాట్లు మానేయండి..
Advertisement

తాజా వార్తలు