బాలీవుడ్ లో మాత్రమే నేపోటిజం ఉందా ? సౌత్ సినిమా ఇండస్ట్రీ లో అలాంటి వాసన లేదా ?

ఈరోజు ఈ ఆర్టికల్ లో ఖచ్చితంగా ఒక చిన్న విషయం గురించి వివరణ ఇవ్వాలని ఉంది.అదేంటంటే నేపోటిజం.

బాలీవుడ్ కి సౌత్ ఇండియా కి ఉన్న ఒక లైన్ గురించి ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.నెపోటిజం అనే మాట బాలీవుడ్ లో చాలా దారుణంగా వింటాం.

ప్రతి స్టార్ హీరో వెనక బ్యాగ్రౌండ్ ఉంటుంది.బ్యాక్ గ్రౌండ్ లేని ఆర్టిస్టులు అక్కడ బ్రతకలేరు.

అందుకు ఉదాహరణే సుశాంత్ రాజ్ పుత్ సింగ్( Sushant Singh Rajput )మాటిమాటికి కంగనా ఈ విషయంపై నోరు పారేసుకుంటూ కూడా ఉంటుంది.ఒక బ్యాచ్ నీ కొంతమంది ఎంకరేజ్ చేసి వారిని మాత్రమే స్టార్ట్ చేస్తున్నారని, మిగతా వారిని తొక్కేస్తున్నారని నెపోటిజం టాలీవుడ్ బాలీవుడ్ లో భయంకరంగా వేళ్ళు పాతుకుపోయాయని, ఇక్కడ వారి మాటే నెగ్గుతుందని, వారు చెప్పినట్టుగానే సినిమాలు విడుదలవుతాయని, వారు మాట వినకపోతే ఎంతకైనా దిగజారుతారని ఇలా రకరకాలుగా మాట్లాడుతుంటారు.

Advertisement

అయితే బాలీవుడ్ లో మాత్రమే ఉందా ? మరి సౌత్ ఇండియా మాట ఏంటి.? ఇక్కడ ఎందుకు నెపోటిజం గురించి అంత పెద్ద ఎత్తున చేర్చే జరగదు.దానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

ఏంటి అంటే.? సౌత్ ఇండియాలో కూడా పెద్ద పెద్ద స్టార్స్ పిల్లలు మాత్రమే అవుతున్నారు.మలయాళం లో దుల్కర్, ఫహద్ ఫజిల్, పృథ్వి రాజ్ ఉంటే తమిళ్లో ధనుష్, సూర్య విజయ్ కుమార్ లాంటి పెద్ద హీరోలు ఉన్నారు.

ఇక మన తెలుగు సినిమా పరిస్థితి విషయానికి వస్తే మహేష్ బాబు, తారక్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ హీరోల పిల్లలే.కన్నడ ఇండస్ట్రీలో కూడా పెద్ద హీరోల పిల్లలు ఇప్పుడు హీరోలు.

అయితే బాలీవుడ్ కి టాలీవుడ్ ( Tollywood )కి ఒక చిన్న లైన్ ఉంది.అదే ఏంటి అంటే అక్కడ వారికి టాలెంట్ లేకపోయినా వారు హీరోలుగా, హీరోయిన్స్ గా చలామణి అవుతున్నారు.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

కానీ ఇక్కడ ఒక సినిమా కోసం ప్రాణం పెడతారు ఉదాహరణకి ఈ ట్రిపుల్ ఆర్ సినిమా కోసం తారక రామ్ చరణ్ ( NTR , Ram charan )ఎంత కష్టపడ్డారో మనం కళ్లారా చూసాం.ఇప్పుడు పుష్పా సినిమా కోసం అల్లు అర్జున్ కూడా ఒళ్ళు హూనం చేసుకుంటున్నాడు.తన బాడీని మలుచుకుంటున్నాడు.

Advertisement

అలాగే బాడీ లాంగ్వేజ్ ని చేంజ్ చేస్తున్నాడు.భాష పై పట్టు సాధిస్తున్నాడు.

ఇలా ఒక్కటేంటి ప్రతి హీరో కూడా సినిమా అంటే ప్రాణం పెట్టి పని చేస్తున్నారు.అందుకే వారు ఇక్కడ ఎవరిపై నెపోటిజం అనే ముద్ర వేయలేరు.

టాలెంట్ ఉన్నోడికి మొదటి అవకాశం దొరకపోవచ్చు.కానీ చివరికి ఎప్పుడు టాలెంట్ మాత్రమే నిలబడుతుంది.

బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాడికి మొదట అవకాశం దొరకవచ్చు.కానీ వారికి టాలెంట్ లేకపోతే ఇక్కడ ఎవ్వరూ పట్టించుకోరు.

ఆ విషయంలో అక్కినేని ఫ్యామిలీని ఉదాహరణగా తీసుకోవచ్చు.నాగచైతన్య, అఖిల్ స్టార్ హీరోల పిల్లలే మరి ఈరోజు స్టార్ హీరోలుగా చెలామణి అవ్వలేకపోతున్నారు.

అందుకే నెపోటిజం అనే మాట విషయానికి వస్తే బాలీవుడ్ కి టాలీవుడ్ కి చాలా పెద్ద తేడానే ఉంది.

తాజా వార్తలు