ఇటీవల కాలంలో బర్రెలక్కగా శిరీష( Barrelakka Sirish ) పాపులర్ రైతే, రైతుబిడ్డగా పల్లవి ప్రశాంత్ పాపులర్ అయ్యాడు.
ఒకరేమో ఎమ్మెల్యే సీటుకి పోటీ చేసి 5 వేలకు పైగా ఓట్స్ తగ్గించుకొని అందరిని ఆశ్చర్యపరిచారు.
మరొకరు ఏమో బిగ్బాస్ టైటిల్ గెలుచుకొని చరిత్ర సృష్టించారు.నిజానికి వీరు చిన్నపాటి రీల్స్ వీడియోలు చేసుకుంటూ జనాల్లో పాపులారిటీ తెచ్చుకున్నారు.
అదే పాపులారిటీని ధైర్యంగా రెట్టింపు చేసుకున్నారు.గజ్వెల్( Gajwel ) ప్రాంతానికి చెందిన ప్రశాంత్, కొల్లాపూర్‌కి చెందిన శిరీష ఇద్దరూ కూడా మట్టి మనుషులే కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయారు.
శిరీష ఒక పొలిటీషియన్ అయిపోయింది.చైతన్యానికి, సాహసానికి, ధైర్యానికి ప్రత్యేకంగా నిలిచింది.
నిరుద్యోగ సమస్యను రూపుమాపుతానంటూ ఒక అడుగు ముందుకేసి సమాజంలో మంచి పేరు సంపాదించింది.కొన్ని పార్టీ వర్గాలు ఆమెపై దాడి చేసిన వెనకడుగు వేయకుండా ఎన్నికల్లో పోటీ పడింది.
మద్దతును, డబ్బును చాలా గౌరవంగా స్వీకరించింది.జనంలో తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని ఆమె తెలియజేసింది.
బర్రెలక్క షార్ట్, టిక్‌టాక్ వీడియోలు చూస్తే చిన్న పిల్లలు కూడా నవ్వుకుంటారు.ఎందుకంటే ఆమెలో అంత అమాయకత్వం కనిపిస్తుంది.కాస్త కూడా పొలిటికల్ నాలెడ్జి లేదనిపిస్తుంది.
అలాంటి అమ్మాయి చుట్టూ ప్రజలు మద్దతు తెలుపుతూ ఎలా తిరిగారు ? అని ఆశ్చర్యం వేస్తుంది.కానీ ఎమ్మెల్యే కి నామినేషన్ వేసాక, ప్రచారం మొదలుపెట్టిన తర్వాత ఆమెలో అమాయకత్వం పూర్తిగా పోయింది.
ఒక రెగ్యులర్ ప్రొఫెషనల్ పొలిటిషన్ గా ఆమె తన ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లింది.
పల్లవి ప్రశాంత్ కూడా బిగ్ బాస్ లోకి రాకముందు బిగ్ జీరో.అతడి ఓల్డ్ వీడియోలు చూస్తే అతను ఒక ఉన్మాదిలా కనిపిస్తుంటాడు.మట్టిని నోట్లో కుక్కుకుంటూ, అరుస్తూ, ఏడుస్తూ పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటాడు హౌస్ లో అడుగు పెట్టిన సమయంలోను అతను ఇదే ఆటిట్యూడ్ చూపించాడు.
ఒకరకంగా అతడి మెంటల్ కండిషన్ బాగోలేదనిపించే స్థాయికి కూడా వచ్చాడు.అయితే ప్రశాంత్ ఒక రైతుబిడ్డ అని తనను తాను పరిచయం చేసుకొని బాగానే సానుభూతిని పొందగలిగాడు.
తన బిహేవియర్ అడ్జస్ట్ చేసుకొని చివరికి టైటిల్ నెగ్గ గలిగాడు.హౌస్ లో ఉన్నంతవరకు కూడా అతడికి ఒక ఇండివిడ్యుయాలిటీ కనిపించలేదు.హౌజులో చెడుగా ప్రవర్తించే శివాజీకి పాలేరుగా ఉంటూ ఆట ఆడాడు.
బిగ్ బాస్ టీం కావాలనే అతడిని విన్నర్ చేసింది కానీ నిజంగా అతడు ఆటపరంగా ఏ విధంగానూ టైటిల్ కి అర్హుడు కాదనేది కొంతమంది మాట.దానికి ఇతడు ఒక అజ్ఞాని బయటకు వచ్చాక కూడా అరాచకం సృష్టించి పోలీసుల కేసులో ఇరుక్కున్నాడు.మళ్లీ ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లి పరువు తీసుకున్నాడు.
మొత్తం మీద బర్రెలక్క సొసైటీ కి కావాల్సిన, ఉపయోగపడే వ్యక్తి అయితే ప్రశాంత్( Pallavi prashanth ) దేనికి పనికిరాని ఒక వ్యక్తి అని చెప్పుకోవచ్చు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy